Telugu News

మొక్కల డాక్టర్ కు ఘనసన్మానం

ఘనంగా వనజీవి రామయ్య జన్మదిన వేడుకలు

0

మొక్కల డాక్టర్ కు ఘనసన్మానం

  • == ఘనంగా వనజీవి రామయ్య జన్మదిన వేడుకలు
  • == మొక్కల డాక్టర్ ను సన్మానించిన ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఏవో డాక్టర్ కే రాజశేఖర్ గౌడ్
  • ==  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కను వనజీవి రామయ్య తో నాటించిన డాక్టర్లు
  • ఖమ్మం ప్రతినిధి, జూలై 1(విజయంన్యూస్)

పద్మశ్రీ పురస్కార గ్రహీత, వనజీవి రామయ్య జన్మదిన వేడుకలు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి డాక్టర్ కే రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. సందర్భంగా రామయ్యను డాక్టర్ కే రాజశేఖర్ గౌడ్ సన్మానించారు. రామయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆయనతో డాక్టర్ కే రాజశేఖర్ గౌడ్ ఒక మొక్క నాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యులమైన మేము రోగులకు చికిత్స మాత్రమే చేస్తామని, కానీ వనజీవి రామయ్య అకుంఠిత దీక్షతో పర్యావరణానికి చికిత్స చేస్తున్నారని కొనియాడారు. ఆయన నాటిన లక్షలాది మొక్కలు నేడు వటవృక్షాలుగా ఎదిగాయన్నారు. తాను నాటిన ఎర్రచందనం వృక్షాలను ప్రభుత్వ హరిత నిధికి ఇస్తామని వనజీవి రామయ్య చెప్పడం ఆయన హరిత దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. ఈరోజు ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా మమ్మల్ని సన్మానించేందుకు రామయ్య వచ్చారని, కానీ ఈరోజు రామయ్య జన్మదినం కావడంతో ఆయనను మేము సత్కరించామని రాజశేఖర్ గౌడ్ తెలిపారు. జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో తాను కూడా విరివిగా మొక్కలు నాటుతున్నట్టు రాజశేఖర్ గౌడ్ వివరించారు. గతేడాది అక్టోబర్ మాసంలో ఖమ్మం జిల్లాలోని ప్రతీ గుడికి జమ్మి మొక్కలను అందజేసినట్టు ఆయన తెలిపారు. వనజీవి రామయ్యను సన్మానించిన వారిలో డాక్టర్ కే సుజన, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ నిఖిల్ ఉన్నారు.

allso read- చిన్నారి అభినయశ్రీ వైద్యానికి మంత్రి పువ్వాడ సాయం