Telugu News

ఖమ్మం మహిళ కు గౌరవ డాక్టరేట్

డబ్య్లూహెచ్ఆర్పీసీ నుంచి అంతర్జాతీయ గౌరవ సభ్యత్వం పొందిన మహిళ 

0

ఖమ్మం మహిళ కు గౌరవ డాక్టరేట్

డబ్య్లూహెచ్ఆర్పీసీ నుంచి అంతర్జాతీయ గౌరవ సభ్యత్వం పొందిన మహిళ 

(ఖమ్మం -విజయం న్యూస్)

ఖమ్మం కు చెందిన మహమ్మద్ ఫర్హ ను world human rights protection commission ( WHRPC ) వారు గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. సెప్టెంబర్ 26 న డిల్లీ లోని ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ ( IIC ) లో జరిగిన కార్యక్రమం లో మహిళా సాధికారతకు తనకు ఈ గౌరవం లభించిందని ఫర్హా తెలిపారు. ఈ కార్యక్రమం లో తనకు WHRPC అంతర్జాతీయ గౌరవ సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది.గతంలో ఫర్హ మిస్సెస్ ఇండియా మొదటి రన్నర్ అప్ గా నిలిచారు. తనకు దక్కిన ఈ గౌరవానికి ఫర్హ సంతోషం వ్యక్తం చేసారు. మహిళా సాధికారత కోసం తను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఈ సందర్బంగా ఫర్హ తెలిపారు.అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వున్న WHPRC గౌరవ డాక్టరేట్ ను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించిందని ఫర్హ తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్, సుప్రీమ్ కోర్టు మాజీ న్యాయమూర్తి దేశాయి్ ,జ్యోతిక కాల్రా , ప్రొఫెసర్ డి.పి.మిశ్రా , గోవా మాజీ ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్కో సార్డిన్హా , WHPRC అంతర్జాతీయ డైరక్టర్ Dr.అభిన్న హోటా, అంతర్జాతీయ కార్యదర్శి మాక్సిమ్ సెంగియుంవా , అంతర్జాతీయ చైర్మన్ తపన్ కుమార్ రౌతారే ల సమక్షంలో జరిగిందని ఫర్హ తెలిపారు .

ఇది కూడా ఒపెన్ చేయండి.. చదవండి : కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన సీఎం కేసీఆర్