Telugu News

 కోలాటమేసిన మంత్రి పువ్వాడ ** వేపకుంట్లలో రైతుబంధు సంబరాలు..**

%% రైతుబంధు కొత్త వెలుగులు నింపింది. : మంత్రి పువ్వాడ

0

 కోలాటమేసిన మంత్రి పువ్వాడ
%% వేపకుంట్లలో రైతుబంధు సంబరాలు..
%% రైతుబంధు కొత్త వెలుగులు నింపింది. : మంత్రి పువ్వాడ
(రఘునాథపాలెం – ఖమ్మం – విజయంన్యూస్)
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోలాటమేశారు. రైతు సంబరాల్లో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో పర్యటించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వి.వి.పాలెం, చిమ్మపూడి, వేపకుంట్లలో జరిగిన రైతుబంధు సంబరాల్లో పాల్గొన్నారు.

ముందుగా ఎడ్లబడ్లపై ప్రదర్శన చేసిన మంత్రి అక్కడ మహిళలు కోలాటమాడుతుంటే వారితో పాటు కోలాటమేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ పోటోను ముగ్గురూపంలో వేయగా ఆ పోటోను చూసి మంత్రి మహిళలను అభినందించారు.

అలాగే సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయంతో అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

also read :- తెలంగాణలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.

రైతు బంధు సంబరాల్లో భాగంగా ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలంలోని వివి పాలెం, వేపకుంట్ల గ్రామంలో రైతుబంధు సంబురాల్లో భాగంగా రైతులు, ప్రజాప్రతినిదులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సూడా చైర్మన్ విజయ్ కుమార్, జడ్పీటిసి ప్రియాంక, ఎంపిపి గౌరీ, ఖమ్మం వ్యవసాయమార్కెట్ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల, వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాస్ నాయక్,ఆర్డీవో రవీంద్రనాథ్, తహసీల్దార్ నర్సింహారావు, ఆత్మ చైర్మన్ భూక్య లక్ష్మణ్ నాయక్, సోసైటీ చైర్మన్ మందడపు సుధాకర్ , మండల అధ్యక్షుడు వీరునాయక్ , నాయకులు దొంతు సత్యం , నర్సింహారావు నాయకులు తదితరులు ఉన్నారు.

ALSO READ :- ఘనంగా ఎంఎల్ఏ కందాళ జన్మదిన వేడుకలు : ఎం.పీ.పీ మంగిలాల్