కూసుమంచి ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కొండా శ్రీనివాస్ రావు నియామకం
అభినందనలు తెలిపిన మండల పార్టీ నాయకులు
కూసుమంచి ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కొండా శ్రీనివాస్ రావు నియామకం
== అభినందనలు తెలిపిన మండల పార్టీ నాయకులు
*కూసుమంచి, మార్చి 9(విజయంన్యూస్):
కూసుమంచి మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామానికి చెందిన కొండా శ్రీనివాస్ రావు ను నియమిస్తూ శుక్రవారం నియామక పత్రాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొడ్డు బొందయ్య అందజేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జరిగిన జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశంలో పలు అనుబంధ సంఘాల అధ్యక్షులను ప్రకటించారు. కూసుమంచి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడి గా కొండా శ్రీనివాస్ రావు ను ఎంపిక చేసి ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొండా శ్రీనివాస్ రావు పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేస్తారనే నమ్మకంతో ఆయనకు బాధ్యతలను ఇవ్వడం జరిగిందని అన్నారు. ఏఐసీసీ, పీసీసీ, సీఎల్పీ ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగ కొండా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండలం అధ్యక్షుడిగా నాపై నమ్మకం ఉంచి నన్ను నియమించినందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్యకి, నాపై నమ్మకం ఉంచి నన్ను ప్రతిపాదించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని హామిఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో హాజరైన రాయల నాగేశ్వరరావుకి, మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు బానోతు వినోదకి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదికూడా చదవండి: వాటర్ ట్యాంక్ ప్రారంభించిన “కాంగ్రెస్ పార్టీ” నాయకులు