‘గూడెం’ పై కూనంనేని కన్ను
== ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసేందుకు కసరత్తు
== కూనంనేని లేదంటే సీపీఐ అభ్యర్థి బరిలో
== పొత్తులున్న కొత్తగూడెంను వదులుకోమంటున్న సీపీఐ
== స్పష్టం చేస్తున్న కూనంనేని
== రసవత్తరంగా మారుతున్న గూడెం రాజకీయాలు
కొత్తగూడెం నియోజకవర్గంపై సీపీఐ పార్టీ కన్నేసింది.. ఈ సారి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేయాలని గట్టినిర్ణయంతో ఉంది. పొత్తులు ఉన్నా లేకపోయిన కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని సీపీఐ పార్టీ భావిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో వదిలేసుకునేదే లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేస్తుండగా, ఆ దిశగా అడుగులు ముందుకేస్తున్నారు.. కూనంనేని బరిలో నిలుస్తారా..? పార్టీ నుంచి మరోకరు అభ్యర్థి గా పోటీ చేస్తారా..? అనే విషయాన్ని పక్కన బెడితే కొత్తగూడెంలో సీపీఐ పార్టీ పోటీ తథ్యం అన్నట్లుగా వినిపిస్తోంది.. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితేంటనేది..? ప్రశ్నార్థికంగా మారింది.. కొత్తగూడెం నియోజవకర్గంలో తాజా పరిస్థితులపై ‘విజయం’ ప్రతినిధి ప్రత్యేక కథనం.
ఇది కూడా చదవండి: 16న ఈడీ ముందుకు కవిత
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
కొత్తగూడెం నియోజకవర్గంపై సీపీఐ పార్టీ కన్నేసింది.. కచ్చితంగా పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం దృఢసంకల్పంతో ఉంది. పొత్తులు ఉన్నా లేకపోయినప్పటికి కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది.. అవసరమైతే కూనంనేని సాంబశివరావును, లేదంటే పార్టీ నుంచి మరోక సీనియర్ నాయకుడ్ని బరిలో నిలిపేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీ చేస్తామనే విషయంపై కూనంనేని సాంబశివరావు స్పష్టం చేస్తున్నారు. కచ్చితంగా పోటీ చేసేదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే
ఇది కూడా చదవండి: ఖమ్మంలో కాంగ్రెస్ కార్పొరేటర్లపై చిన్న చూపేందుకు ?
తెలంగాణ రాష్ర్టంలోనే అన్ని జిల్లా కంటే ప్రధాన ఏజెన్సీ జిల్లా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో.. జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాలు ఉంటే అందులో నాలుగు ఎస్టీ రిజర్వేషన్ కాగా, ఒక్కటి మాత్రమే జనరల్ నియోజకవర్గం. ఆ ఒక్క నియోజకవర్గమైన కొత్తగూడెం జిల్లాలో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారింది.. విచిత్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి విచిత్రమైన ఫలితాలనే ఇస్తూ వచ్చింది.. 1978 నుంచి ఎన్నికలను పరిశీలిస్తే జనతా పార్టీ విజయం సాధించగా, ఆ తరువాత స్వతంత్ర అభ్యర్థికి అవకాశం కల్పించింది. తిరిగి టీడీపీ అభ్యర్థికి అవకాశం ఇచ్చిన ఆ నియోజకవర్గం ఆ తరువాత కాంగ్రెస్ కు, తిరిగి టీడీపీకి, మళ్లీ కాంగ్రెస్ కు అవకాశం కల్పించింది. 1978 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు జనరల్ ఎన్నికలు జరిగితే అందులో రెండు సార్లు టీడీపీ, నాలుగు సార్లు కాంగ్రెస్, జనతా, సీపీఐ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కోక్క సారి విజయం సాధించాయి. స్వతంత్ర అభ్యర్థిగా కోనేరు నాగేశ్వరరావు విజయం సాధించారు. 1999, 2004 లో వరసగా రెండు సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా, ఆ తరువాత ఏ పార్టీ కూడా రెండవ సారి విజయం సాధించలేదు. గత మూడు సార్లు ఎన్నికలను పరిశీలిస్తే 2009లో సీపీఐ, 2014లో టీఆర్ఎస్, 2018లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీలో విజయం సాధించిన వనమా వెంకటేశ్వరరావు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో వరసగా ఒక్క పార్టీకి పట్టకట్టిన చరిత్ర వనమా వెంకటేశ్వరరావుకు దక్కింది.
ఇది కూడా చదవండి: పొలవరం ముంపు గ్రామాల సంగతేంటి..?
అయితే కొత్తగూడెం నియోజకవర్గం ఏ పార్టీకి కంచుకోట అని చెప్పలేము.. కొంత హెడ్జ్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గౌరవం తీసుకొచ్చింది మాత్రం జలగం వెంకట్రావ్ మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధమైన ఫలితం వస్తే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో రకమైన ఫలితం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ గెలిచిన, గెలిపించిన సీటు కొత్తగూడెం. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ ఓడిపోయింది. అంటే కొత్తగూడెం నియోజకవర్గంలో ఏ నాయకుడికి, ఏ పార్టీకి వరసగా రెండు సార్లు కట్టబెట్టిన దాఖలాలు లేవు.
== కొత్తగూడెంపై కన్నేసిన కూనంనేని
సీపీఐ పార్టీ బలంగా ఉన్న ఏకైక నియోజకవర్గం కొత్తగూడెం. ఇక్కడ 2009 ఎన్నికల్లో విజయం సాధించిందే తప్ప మరేప్పుడు ఇక్కడ విజయం సాధించని సీపీఐ పార్టీ కార్మికుల శక్తితో అక్కడ కొంత ప్రభావం చూపించగలిగింది. సీపీఐ పార్టీ ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ విజయం సాధించడం ఖాయం. ఆ తరహాలోనే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే మరోసారి సీపీఐ పార్టీ కొత్తగూడెం పై కన్నేసింది. రాబోయే 2023 సాధాహరణ ఎన్నికల్లో సీపీఐ పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ చార్జ్ కూనంనేని సాంబశివరావు రాష్ట్ర పార్టీకి కార్యదర్శిగా ఉండటంతో కచ్చితంగా ఆ నియోజకవర్గంలో సీపీఐ పోటీ చేయాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని కుండబద్దలు చేశారు కూనంనేని సాంబశివరావు. రెండు రోజుల క్రితం ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్హ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నకు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
ఇదికూడా చదవండి: ఖమ్మంలో కాంగ్రెస్ కార్పొరేటర్లపై చిన్న చూపేందుకు ?
కచ్చితంగా కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ పార్టీ పోటీ చేస్తుంది అని స్పష్టంగా నొక్కి మరి చెప్పారు. బీఆర్ఎస్ తో పొత్తులుంటాయని చెప్పారు కదా..? ఆ పార్టీ మీకు అవకాశం ఇచ్చిందా..? అని విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన కూనంనేని పొత్తులున్న, లేకపోయిన 2023 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి సీపీఐ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. మీరు పోటీలో ఉంటున్నారా అంటే..? అది కేంద్రపార్టీ చూసుకుంటుంది, కానీ మా పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని చెప్పడం ప్రస్తుత రాజకీయాల్లో సంచలనంగా మారింది.. ఒక వైపు బీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకుంటున్న సీపీఐ పార్టీ కొత్తగూడెంలో కచ్చితంగా పోటీ చేస్తామని ప్రకటించడంతో రాజకీయ మలుపులకు దారి తీసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి..
== బీఆర్ఎస్ వదులుకుంటుందా..?
కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో విచిత్రకరమైన రాజకీయాలకు కేంద్రబిందువైంది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్, ప్రస్తుత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నడుమ వర్గపోరు రగులుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన వనమా వెంకటేశ్వరరావు, ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీనే అంటిపెట్టుకున్న జలగం వెంకట్రావ్ ఇద్దరు మరోసారి సీటు కోసం పోటీ పడే అవకాశం ఉంది. వాళ్లిద్దరే కాకుండా వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్ర, రాష్ట్ర మెడికల్ హెల్త్ ఆఫీసర్ గడల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ పోటీ చేసేందుకు సిద్దమైయ్యారు. వారు టిక్కెట్ ను ఆశీస్తున్నారు. అయితే ఇందులో వనమా వెంకటేశ్వరరావుకు ఆరోగ్యం సహాకరించే అవకాశం లేకపోవడంతో జలగం వెంకట్రావ్ కు అవకాశం ఉన్నట్లే కనిపించిన ఇప్పుడు సీపీఐ పార్టీ వల్ల ఆయనకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పోచ్చు. అయితే టీఆర్ఎస్ పార్టీకి ప్రాణం పోసిన కొత్తగూడెం నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ అధినేత సీపీఐ పార్టీకి వదిలేస్తారా..? అనేది ప్రశ్నగా మారింది. ఒక వేళ వదిలితే ఆ జలగం వెంకట్రావ్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. చూడాలి మరి ఒక వైపు సీపీఐ పార్టీ కచ్చితంగా పోటీ చేసి తీరుతాం అని చెబుతుంటే, మరో వైపు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలని భావిస్తోంది..? రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో..? వేచి చూడాల్సిందే..?