Telugu News

ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవపై ఎఫ్ఐఆర్

-- పాల్వంచ కుటుంబ ఆత్మహత్య కేసులో ట్విస్ట్

0

ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవపై ఎఫ్ఐఆర్

— పాల్వంచ కుటుంబ ఆత్మహత్య కేసులో ట్విస్ట్

— పరారిలో ఎమ్మెల్యే వనమా రాఘవ..?

— వీడియో విడుదల చేసిన పోలీసులు..?

(భద్రాద్రికొత్తగూడెం-విజయంన్యూస్)

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు.. ఇంట్లో గ్యాస్ లీకేజ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రామకష్ణ కుటుంబం విషయంలో  పోలీసులు విచారణ చేస్తుండగా కొన్ని అశ్ఛర్యకర నిజాలు బయటకు వచ్చాయి.. రామకష్ణ అనే వ్యక్తి రాసిన సూసైడ్ నోట్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్ర పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాల్వంచ పోలీసులు వనమా రాఘవేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఆయన్ను అరెస్టు చేయాల్సి ఉండగా వనమా రాఘవేంద్ర పరారిలో ఉన్నట్లు ఏఏస్పీ తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకష్ణ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఆదివారం రాత్రి గ్యాస్ లీకేజ్ చేసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆరా తీయగా ఒక వీడియో, సూసైడ్ నోట్ పోలీసులకు లభించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు పేరున ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పూర్తి స్తాయిలో విచారణ చేసిన పోలీసులు వనమా రాఘవేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

— రాఘవ అభిమానులు ఫైర్

ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సంఘటన విషయంలో ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవ పై కేసు నమోదు చేసిన విషయంపై ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. రామకష్ణ కుటుంబం ఆత్మహత్యకు రాఘవకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే ఆయన్ను బద్నాం చేసేందుకు ఎవరో పడని వారు కుట్రపన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే తనయుడు కాబట్టి ఆయన వద్దకు వందలాధి మంది వస్తారని, చిన్నచిన్న తప్పులు చేస్తున్నప్పుడు మందలిస్తారని అన్నారు. తల్లిని మంచిగా చూసుకోకపోవడం వల్ల ఆకుటుంబాన్నికి సలహాలు ఇచ్చి ఉండోచ్చని, అంత మాత్రానా ఆయనపై కేసులు పెట్టడం సరైంది కాదని వనమా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనమా రాఘవేంద్ర రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు కావాలనే ఆయన్ను అక్రమ కేసులలో ఇరికిస్తున్నారని, పథకం ప్రకారం చేశారని అన్నారు. అందరికి అందుబాటులో ఉంటూ ప్రతి చిన్న విషయాన్ని తన భుజాలపై వేసుకొని ప్రజలకు నేనున్నానంటూ ధైర్యం చేప్పే రాఘవపై కావాలనే బురదజల్లుతున్నారని అన్నారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతున్నారు.

all so read :- పాత పాల్వంచలో ముగ్గురు సజీవదహనం.. మరోకరి పరిస్థితి విషమం