Telugu News

బంగారు దొంగతానాల దొంగ దొరికాడు

వివరాలు వెల్లడించిన కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు

0
బంగారు దొంగతానాల దొంగ దొరికాడు
== వివరాలు వెల్లడించిన కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు
(రిపోర్టర్-శివకుమార్)
అన్నపురెడ్డిపల్లి/అశ్వరావుపేట జూలై 29( విజయం న్యూస్)
జిల్లాలోని సుజాతనగర్, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు, అశ్వాపురం మండలాల్లో పలు దొంగతనాలకు పాల్పపడిన బరిస్సాకు చెందిన భాలై దలి అనే వ్యక్తిని కొత్తగూడెం బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వరబాబు తెలిపారు.శుక్రవారం నాడు
అన్నపురెడ్డిపల్లి పొలీస్ స్టేషన్లో విలేఖర్ల సమావేశంలో  మాట్లాడారు.
నిందితుడు చేసిన పలు దొంగతనాల వివరాల గురించి అయన తెలియచేసారు.ప్రస్తుతం అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు, సుజాతానగర్ లతో పాటు గతంలో కూడా ఖమ్మం జిల్లా నందు, సూర్యాపేట జిల్లా నందు కొన్ని కేసులలో నిందుతునిగా ఉన్నట్లు తెలిపారు.అతని వద్ద 3 లక్షల 73 వేల రూపాయల విలువ గల 15 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.చోరీ కేసులను ఛేదించిన పోలీస్ సిబ్బందిని ప్రశంసించారు. వారిలో సి.ఐ సిసియస్ వేణు చందర్, జూలూరుపాడు సర్కిల్ సిఐ వసంత్ కుమార్, సిసియస్ యస్.ఐ మహేష్, అన్నపురెడ్డిపల్లి ఎస్.ఐ. విజయ, హెడ్ కానిస్టేబుల్ పుల్లారావు, కానిస్టేబుల్ జాన్ పాషా, రామారావు వున్నారు.