Telugu News

కొత్తగూడెంలో  జబర్థస్త్ రచ్చరవి సందడి

వినాయక మండపం వద్ద పూజలు చేసిన రవి

0

కొత్తగూడెంలో  జబర్థస్త్ రచ్చరవి సందడి

== వినాయక మండపం వద్ద పూజలు చేసిన రవి

== కులమతాలకు అతీతంగా జరిగే ప్రతి వేడుకకు హాజరవుతానని తెలిన రవి

భధ్రాద్రికొత్తగూడెం, సెప్టెంబర్ 12(విజయంన్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కేంద్రంలో సినినటుడు, జబర్థస్ ఫేమ్ రచ్చరవి సందడి చేశారు. సోమవారం కొత్తగూడెంలోని చమన్ బస్తి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన దైవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రచ్చా రవి హాజరయ్యారు.

ఇది చదవండి : గోదావరి ఉగ్రరూపం

వినాయక విగ్రహాం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సినీ నటులు రచ్చారవి  మాట్లాడుతూ మన్ బస్తి గణపతి కమిటీ వారు ప్రత్యేక గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి,నిమజ్జన కార్యక్రమాలను దైవభక్తితో నిర్వహిoచి, నిరుపేదల ఆకలిదప్పికలను తీర్చే అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నారని,  అందుకు గాను కమిటీ సభ్యులకు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

తన మిత్రుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందని, కులమతాలకు అతీతంగా జరిగే ప్రతి వేడుక, మరియు దైవ కార్యక్రమాలకు  తాను హాజరవుతానని తెలిపారు..ప్రజలoతా సుభిక్షంగా ఉండాలని ఆయన భగవంతుడిని ప్రార్ధించారు… రచ్చారవి మిత్రులు శ్రేయోభిలాషులు మాట్లాడుతూ సినీ రంగంలో వెండి తెరపై తమమిత్రులు రచ్చా రవి మరెన్నో విజయాలను సాధించాలని, సినీ వినీలాకాశంలో పేరు ప్రఖ్యాతులు పొందాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అప్పారావు,  శ్రీ నందన్ ఇన్ ప్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ టి విజయలక్ష్మి, సీఈఓ క్రాంతికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: క్షీరమా…కాలకోట విషమా..?