Telugu News

==తిరుమలాయపాలెం మండలంలో వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న రెడ్డిమల్ల రమేష్

0

==తిరుమలాయపాలెం మండలంలో వ్యక్తి ఆత్మహత్య
== ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న రెడ్డిమల్ల రమేష్
==(తిరుమలాయపాలెం – విజయం న్యూస్);-
భార్య భర్తల తగువుతో పుట్టింటికి వెళ్లిన తన భార్య తిరిగి కాపురానికి రాకపోగా మనస్తాపానికి గురై రమేష్(35) అనే వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామునమండలంలో చోటుచేసుకుంది. పోలీసుల, స్థానికుల కథనం మేరకు మండల పరిధిలోని తెట్టెలపాడు గ్రామానికి చెందిన రెడ్డిమల్ల రమేష్, అన్నపూర్ణ లకు గత 15సవంత్సరాల క్రితం పెద్దలు పెండ్లి చేశారు. వీరికి లారెన్స్, సన్నీ అనే ఇద్దరు బాబులు. కాగా పెద్ద కుమారుడు లారెన్స్ 8 ఏండ్ల వయసులో 6ఏండ్ల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయి మరణించాడు.

also read :-అమ్మల ఆశీస్సులు అందుకున్న వద్దిరాజు కుటుంబం
గత 4సవంత్సరాల నుంచి రమేష్ అన్నపూర్ణలు వారి చిన్న కుమారుడుతో ఖమ్మంలో ఉంటూ, రమేష్ మున్సిపాలిటీ లో ట్రాకటర్ నదువుతున్నాడు. అయితే వీరికి తరుచూ గోడవలు జరుగుతుంటాయి.గత పదిరోజుల క్రితం రమేష్ అన్నపూర్ణ లు గొడవపడి ఖమ్మంలోని మహిళ పోలీస్ స్టేషన్ వెళ్లారు అక్కడ ఇద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయిన ప్రయోజనం లేదు.దీంతో రెండు రోజుల క్రితం తెట్టెలపాడు గ్రామానికి వచ్చిన రమేష్ మనస్థాపానికి గురై సమాయంతో పనిలేకుండా విపరీతంగా మధ్యం సేవిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

also rea ;-గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించాలి : మంత్రిపువ్వాడ
శుక్రవారం ఉదయం ఎంతకీ రమేష్ గదినుంచి బయటకు రాకపోగా తండ్రి వెంకటేశ్వర్లు కిటికీలోంచి తొంగిచూడగా విగత జీవిగా ఉరి తాడుకు వేలాడుతున్న కొడుకును చూసి తండ్రి వెంకటేశ్వర్లు ఒక్కసారిగా రోధించే సారికి చుట్టుపక్కల వారు వచ్చి, మండల పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించమని,
మృతుని అన్న నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.