Telugu News

రియల్టర్లు హత్య కేసు ని చేదించిన రాచకొండ పోలీసులు

ఎల్బీనగర్-విజయం న్యూస్

0

రియల్టర్లు హత్య కేసు ని చేదించిన రాచకొండ పోలీసులు
(ఎల్బీనగర్-విజయం న్యూస్)
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో రీయ్ల్టర్ల హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసు వివ‌రాల‌ను ఎల్బీన‌గ‌ర్‌లోని రాచ‌కొండ సీపీ క్యాంపు కార్యాల‌యంలో గురువారం రాచ‌కొండ పోలీస్ క‌మిష‌నర్ మ‌హేష్ భ‌గ‌వ‌త్ మీడియా స‌మావేశంలో వెల్లడించారు. ఇబ్రహీంపట్నం రియల్టర్ హత్య కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు మట్టారెడ్డితో సహా ఆరుగురు నిందితులందరినీ అరెస్ట్ చేశామన్నారు. మ‌రో ఇద్దరు నిందితులు ప‌రారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

రెండు తుపాకులు, 19 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ తుపాకులు బీహార్ లో కొనుగోలు చేసిన‌ట్లు తెలిపిన సీపీ ఆరుగురిలో ఇద్దరు బీహార్ నిందితులు ఉన్నారన్నారు. ప్రధాన నిందితుడైన మట్టారెడ్డికి పెద్ద నేర చరిత్ర ఉందని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలోనే కాల్పులు జరిగాయని వెల్లడించారు. మ‌ట్టారెడ్డి సైట్ వాచ్‌మెన్ మోహినూద్దీన్ రియ‌ల్టర్లను గ‌న్‌తో కాల్చి హ‌త్య చేసినట్లు పోలీసుల విచార‌ణ ఒప్పుకున్నట్లు తెలిపారు. గ‌న్‌తో కాల్పులు జ‌రిపిన త‌రువాత గ‌న్‌ను మ‌ట్టారెడ్డికి చెందిన మ‌రో సైట్‌లో పాతిపెట్టి, ఘ‌ట‌న త‌రువాత కూడా అదే సైట్‌లో వాచ్‌మెన్ ఉన్నట్లు వివ‌రించారు.

also read :-బంగాళాఖాతంలో అల్పపీడనం…

వాచ్‌మెన్ మోహినూద్దీన్ గ‌తంలో ఏపీ గుడివాడ‌లో ఉండేవాడ‌ని. గ‌త రెండేళ్లుగా ఇక్కడే వాచ్‌మెన్‌గా కుటుంబ‌స‌భ్యుల‌తో ఉంటున్నట్లు తెలిపారు. ఈ కేసులో మ‌ట్టారెడ్డి, మోహియూద్దీన్ ల‌తో పాటు బుర్రి భిక్షప‌తి, స‌యీద్ ర‌హీం, స‌మీర్ అలీ, రాజు ఖాన్‌ల‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. చంద‌న్ సిబాన్‌, సోనులు ప‌రారీలో ఉన్నట్లు తెలిపారు. హైద‌రాబాద్ శివారులోని ఇబ్రహీంప‌ట్నం స‌మీపంలో రెండు రోజుల క్రితం ఇద్దరు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌పై తుపాకీ కాల్పులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌లో ఇద్దరు రియ‌ల్టర్లు శ్రీ‌నివాస్‌రెడ్డి, రాఘ‌వేంద‌ర్‌రెడ్డిలు చ‌నిపోయారు.

also read :-సీఎం కేసీఆర్‌తో సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి, రాకేశ్ తికాయ‌త్ భేటీ

సంచ‌ల‌నం సృష్టించిన ఇబ్రహీంప‌ట్నం కాల్పుల కేసును తాజాగా రాచ‌కొండ పోలీసులు చేధించారు. ఘ‌ట‌న జ‌రిగిన రెండు రోజుల్లో నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌ట్టారెడ్డి గ్యాంగ్ ఈ హ‌త్యల‌కు పాల్పడిన‌ట్లు పోలీసులు వెల్లడించారు. ప‌ది ఏక‌రాల భూ వివాదంలో త‌ల‌దూరుస్తున్న శ్రీ‌నివాస్‌రెడ్డి, రాఘ‌వేంద‌ర్‌రెడ్డిల‌ను అడ్డు తొల‌గించుకునేందుకు మ‌ట్టారెడ్డి సుఫారీ గ్యాంగును పుర‌మాయించిన‌ట్లుగా పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది.

ఇబ్రహీంప‌ట్నం పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని క‌ర్ణంగూడ గ్రామ‌ స‌మీపంలో రెండు నెల‌ల క్రితం ఇద్దరు భాగ‌స్వాములైన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీ‌నివాస్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి రాఘ‌వేంద‌ర్‌రెడ్డిలు 10 ఎక‌రాల భూమి కొన్నారు. కానీ అప్పటికే ఆ భూమి త‌న‌దేనంటూ మ‌ట్టారెడ్డి దాన్ని క‌బ్జా చేశారు. ఈ విష‌యంలో వీరి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీ‌నివాస్ రెడ్డి మ‌రో వ్యక్తితో క‌లిసి సైట్ వ‌ద్దకు వెళ్లగా, అక్కడే ఉన్న మ‌ట్టారెడ్డితో వాగ్వాదం జ‌రిగింది. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీ మంగ‌ళ‌వారం ఉద‌యం మ‌ట్టారెడ్డి ఇత‌రుల‌తో క‌లిసి శ్రీ‌నివాస్‌రెడ్డి, రాఘ‌వేంద‌ర్‌రెడ్డిపై కాల్పులు జ‌రిపారు.

also read :-రాజ్యాంగాన్ని అవమానిస్తున్న కేసీఆర్

శ్రీ‌నివాస్ అక్కడిక‌క్కడే చ‌నిపోగా, రాఘ‌వేంద‌ర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హ‌త్య అనంత‌రం మృతుల రెండు కుటుంబాల వారు కూడా మ‌ట్టారెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసుల‌కు విచార‌ణ మ‌రింత సులువు అయ్యింది. అత‌డిని పోలీసులు అదుపులోకి తీసుకుని త‌మ‌దైన శైలిలో విచార‌ణ జ‌రపగా మ‌ట్టారెడ్డే సుపారీ గ్యాంగ్‌తో ఈ హ‌త్యలు చేయించిన‌ట్లు పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. సాంకేతిక ఆధారాల‌ను సేక‌రించిన పోలీసులు మృతుల కాల్‌డేటా, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచార‌ణ చేశారు. కొన్ని నెల‌లుగా వీరిద్దరు సెటిల్‌మెంట్ చేసిన భూముల వివ‌రాల‌ను కూడా ప‌రిశీల‌న‌లోకి తీసుకున్నారు. ఈ కేసును త‌ర్వత‌గ‌తిన ఛేదించిన ఎస్వోటీ డీసీపీ ముర‌ళీధ‌ర్‌, ఇన్‌స్పెక్టర్లు అంజిరెడ్డి, సుధాక‌ర్‌, రాములుతో పాటు పోలీసు సిబ్బందిని అభినందించారు.