Telugu News

పాలేరు జలాశయంలో వివాహిత మృతిదేహం లభ్యం

0

పాలేరు జలాశయంలో వివాహిత మృతిదేహం లభ్యం

(కూసుమంచి విజయం న్యూస్);-
కూసుమంచి, డిసెంబర్ 22 : కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయంలో ఓ వివాహిత మృతదేహం లభ్యమైంది. బుధవారం చెరువు సమీపంలోకి వెళ్లిన స్థానికులు కూసుమంచి పోలీసులకు సమాచారం అందించగా, తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మతదేహాన్ని గజఈతగాళ్ల సహాయంతో బయటకు తీసుకొచ్చి, ఆధారాల కోసం పరిశీలించారు. కాగా ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఆచూకి కోసం దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుప్రతికి తరలించారు. అయితే ఆ వివాహితకు సుమారు 25 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది. ఆమె ఒంటిపై ఆకుపచ్చకలర్ పూలపూల పంజాబీ డ్రస్, అరెంజ్ కలర్ లెగ్గిన్ వేసుకుని ఉన్నది. ఎవరైన ఆమె గురించి వివరాలు తెలియాలనుకునేవారు, కుటుంబాల బాధ్యులు కూసుమంచి పోలీసులను సంప్రదించగలరు

ALSO READ;-తెలంగాణ రైతుల‌పై బీజేపీ ప‌గ‌ : మంత్రి పువ్వాడ.