Telugu News

సుక్మాలో పోలీస్ కానిస్టేబుల్ హత్య

(ఛత్తీస్‌గఢ్ విజయం న్యూస్

0

సుక్మాలో పోలీస్ కానిస్టేబుల్ హత్య

(ఛత్తీస్‌గఢ్ విజయం న్యూస్);-

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో కానిస్టేబుల్ లఖేశ్వర్ నాగ్ హత్యకి గురైనాడు. కుకనార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్రాస్‌ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ తన గ్రామంలో నిర్వహించే జాతరను చూసేందుకు వచ్చాడు. జాతరకు వెళ్ళి తిరిగి వస్తుండగా గత‌ రాత్రి 2 గంటల ప్రాంతంలో జవాన్ హత్యకి గురైనట్లు సమాచారం. పదునైన ఆయుధంతో హత్య చేశారు. కానిస్టేబుల్‌ హత్య వెనుక నక్సలైట్ల హస్తం ఉందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అయితే సంఘటనా స్థలంలో పోలీసులకు ఎలాంటి కరపత్రం లభించలేదు. పోలీసు ఉన్నతాధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.