Telugu News

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు…

సిని ఇండస్ట్రీ లో విషాదం

0

*రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు…

** సిని ఇండస్ట్రీ లో విషాదం

** గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు

(హైదరాబాద్ -విజయం న్యూస్)

సిని గ్లామర్..ఏడు అడుగులు అందగాడు.. మాస్ హీరో.. భక్తి కన్నప్ప గా పిలవబడే రెబలై స్టార్ కృష్ణంరాజు ఇంకా లేరు. ఆయన హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు.1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన జన్మించారు.

Allso read:- ఖమ్మంకు వచ్చిన ‘ఇస్మాట్ శంకర్’

ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెబల్ స్టార్ ఈ రోజు ఉదయం మరణించారు. దీంతో సిని ఇండస్ట్రీ విషాదంలో మునిగిపొయింది.ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని కృష్ణంరాజు ఫాన్స్ గౌరవ సలహాదారుడు జొన్నలగడ్డ శ్రీరామచంద్ర శాస్ట్రీ అన్నారు.రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణంరాజు మరణంతో సిని ఇండస్ట్రీ మొత్తం సంతాపం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. బీజేపీ నాయకులు కృష్ణంరాజు ఇంటికి బయలుదేరారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.