Telugu News

కూసుమంచిలో అధికారులపై ప్రశ్నల వర్షం.

%% హాట్ హాట్ గా మండల సర్వసభ్యసమావేశం

0

కూసుమంచిలో అధికారులపై ప్రశ్నల వర్షం
%% హాట్ హాట్ గా మండల సర్వసభ్యసమావేశం
%% ఏ ఒక్క అధికారిని వదలని ప్రజాప్రతినిధులు
%% మండల వైద్యాధికారికి సభ ప్రశంసలు
%% పాఠశాలల తరగతి గదుల నిర్మాణానికి సభ తీర్మాణం
(కూసుమంచి-విజయంన్యూస్):-
కూసుమంచి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మండలానికి చెందిన పలుశాఖల అధికారులపై ప్రజాప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎప్పుడు సాధాసీధాగా నడిచే మండల పరిషత్ బుధవారం మాత్రం హాడలెత్తిపోయింది. ప్రజాప్రతినిధులు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అధికారులు సమాధానాలు చెప్పలేక సర్దుకునే ప్రయత్నంచేశారు. కానీ మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ను సభ ప్రశంసలతో ముంచేత్తింది.. ఆయన సేవలను అభినందిస్తూ చప్పట్లతో వైద్య సిబ్బందికి అందరికి సలామ్ అని చెప్పారు. బుధవారం కూసుమంచి ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. కోవిడ్ నిబంధనల ప్రకారం సర్వసభ్యసమావేశాన్ని నిర్వహించగా ప్రజాప్రతినిధులు, పలు శాఖలాధికారులు హాజరైయ్యారు. కాగా మండలాధికారులను ప్రజాప్రతినిధులు ప్రశ్నలతో ముంచేత్తారు.

also read :-జనవరి 10 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు లేవు- మహుబూబాబాద్ ఎస్పీ

విద్యాశాఖాధికారి వెంకటరామాచారి మాట్లాడుతుండగా లోక్యతండా ఎంపీటీసీ జర్పుల బాలాజీనాయక్ టీచర్ల సంగతేంటి అని ప్రశ్నించారు.జగ్మల్ తండాలో గతేడాది 100మందికిపైగా విద్యార్థులుంటే ఈ ఏడాది 23 మందికి సంఖ్య పడిపోయారని, కారణంగా పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులుంటే వారిని డిప్యూటేషన్ పై ఇతర ప్రాంతాలకు పంపించడం వల్ల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారని అన్నారు. అలాగే మండలం మొత్తం అదే సమస్య ఉందని, అధికారిగా మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా ఆయన నా పరిధిలో లేదని, డీఈవో పరిధిలో ఉందని చెప్పడంతో సభ్యులు ఆగ్రహించారు. అలాగే సీడీపీవో మాట్లాడుతుండగా ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. మండలంలో లోక్యతండా పలు గ్రామాల్లో అంగన్ వాడీ కేంద్రాల భవనాలు మధ్యలోనే నిలిచిపోయాయని, వాటి గురించి మాట్లాడే నాథుడే లేడని ఆగ్రహించారు.

ఎక్సైజ్ ఎస్ఐ మాట్లాడుతుండగా ప్రజాప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. కూసుమంచి మండలంలో ఏ ఒక్క వైన్స్ షాపులో ఎంఆర్పీ రేటుకు అమ్ముతున్నారా..? ఊరూరా వైన్స్ షాపులు ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఎందుకు నడుస్తున్నాయి.. బెల్ట్ షాపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు..దాడులు ఎందుకు చేయడం లేదు.. అలాగే మధ్యం తెచ్చుకుంటే వాళ్ల ఇండ్లపై దాడులు చేసి ఇబ్బందులు ఎందుకు చేస్తున్నారు. మీకేం హక్కు ఉంది వారిని ఇబ్బందులకు గురి చేయడానికి అంటూ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, పలువురు ప్రశ్నల సందించారు. దీంతో ఎక్సైజ్ ఎస్ఐ నీళ్లు తాగే పరిస్థితికి వచ్చింది.

also read :-డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు…తన వెహికిల్ ని తనే తగలబెట్టుకున్నాడు*
%% మండల వైద్యాధికారిని అభినందించిన సభ
కూసుమంచి మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ మండల సమావేశ సభ అభినందించింది. కరోనా కష్టకాలంలో అన్ని గ్రామాలు తిరుగుతూ, అందర్ని ప్రోత్సహిస్తూ కరోనా వచ్చిన వారి ఇంటికి వెళ్లి వారికి సేవలు చేస్తూ, ఆసుపత్రికి వచ్చిన వారందరికి వైద్యసేవలను అందిస్తూ, వారికి మంచి సలహాలను అందిస్తున్నారని సభ కోనియాడారు. ఆయన, వారి వైద్యసిబ్బంది సేవల వల్లనే కూసుమంచి మండలంలో కరోనా వైరస్ ను నియంత్రించడం జరిగిందని అన్నారు. వారికి చప్పట్ల రూపంలో అభినందించారు. పలువురు ప్రజాప్రతినిధులు వైద్యులకు సలామ్ చేశారు. అలాగే మండల పరిషత్ నిధులు సుమారు రూ.20లక్షలను కూసుమంచి, నాయకన్గూడెం,బోడియతండా, ఈశ్వరమాదారం పరిధిలోని పాఠశాలలకు తరగతి గదులను మంజూరు చేస్తూ సభ ఏక్రగీవ తీర్మాణం చేశారు. అలాగే ప్రభుత్వాసుపత్రిలో ఇన్వైటర్ అవసరం ఉండగా వాటికి నిధులు లేకపోవడంతో ఎంపీపీ శ్రీనివాస్ నాయక్, ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీలు మాదాసుఉపేందర్ తదితరులు రూ.5వేల చొప్పున మొత్తం రూ.50వేలతో కొనిస్తామని హామినిచ్చారు.