Telugu News

కంటోన్మెంట్‌ అధికారుల తీరుపై కెటిఆర్‌ గుస్సా

ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కరెంట్‌, నీళ్లు బంద్‌ చేస్తాం

0

కంటోన్మెంట్‌ అధికారుల తీరుపై కెటిఆర్‌ గుస్సా
== ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కరెంట్‌, నీళ్లు బంద్‌ చేస్తాం
== అసెంబ్లీ వేదికగా మరోమారు కేంద్రం తీరుపై ఆగ్రహం
(అసెంబ్లీ-విజయంన్యూస్)
కంటోన్మెంట్‌లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా కేంద్రం అడ్డుపుల్లలు వేస్తోందని, అక్కడ రహదారులను మూసేస్తోందని మంత్రి కెటిఆర్‌ మరోమారు కేంద్రంపై ధ్వజమెత్తారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కంటోన్మెంట్‌కు నీళ్లు,కరెంట్‌ బంద్‌ చేస్తామని హెచ్చరించారు.అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా శనివారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు.

also read;-రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకం: మంత్రి తలసాని
ప్రశ్నోత్తరాల సందర్భంగా కార్వాన్‌ నియోజకవర్గంలో నెలకొన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే
అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్‌ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోమన్నారు. ఒక వైపు కంటోన్మెంట్‌లో చెక్‌ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతోంది. శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్‌ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్‌ఐ అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఇలా కంటోన్మెంట్‌, ఏఎస్‌ఐ అభివృద్ధికి అడ్డు పడుతోందని విమర్శలు గుప్పించారు.

also read :-అందమైన ప్రేమ కథ ‘రాధేశ్యామ్‌’

ఇది మంచి పద్ధతి కాదు.. కంటోన్మెంట్‌ అధికారులను తక్షణమే పిలిచి మాట్లాడాలని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీని ఆదేశిస్తామని మంత్రి తెలిపారు. ఒక వేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు రోడ్లు బంద్‌ చేస్తాం.. నాలాల విూద చెక్‌ డ్యాంలు కడుతామంటే చూస్తూ ఊరుకోమంటూ తేల్చి చెప్పారు. అవసరమైతే కంటోన్మెంట్‌కు మంచినీళ్లు, కరెంట్‌ బంద్‌ చేస్తాం. అప్పుడైనా దిగిరారా అంటూ అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి అడ్డుపడుతున్న కంటోన్మెంట్‌ అధికారులపై మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంటోన్మెంట్‌ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వాళ్లు రోడ్లు బంద్‌ చేస్తే.. తాము కరెంట్‌, నీళ్లు బంద్‌ చేస్తామని కేటీఆర్‌ తేల్చిచెప్పారు.

తెలంగాణ వేరే దేశం అన్నట్టు కేంద్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది. హైదరాబాద్‌లో ఉంటున్నప్పుడు కంటోన్మెంట్‌ కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇష్టమొచ్చినట్లు రోడ్లు బంద్‌ చేస్తాం.. నాలాల విూద చెక్‌ డ్యాంలు కడుతామంటే మేం కూడా ఊరుకోం అని కేటీఆర్‌ హెచ్చరించారు. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం. అవసరమైతే మంచినీళ్లు, కరెంట్‌ బంద్‌ చేస్తాం. అప్పుడైనా దిగిరారా అని కేటీఆర్‌ పేర్కొన్నారు.
కంటోన్మెంట్‌ అధికారులను తక్షణమే పిలిచి మాట్లాడాలని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీని ఆదేశిస్తామని కేటీఆర్‌ తెలిపారు. ఒక వేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలకు, కఠిన చర్యలకు కూడా వెనుకాడొద్దని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున శాసనసభలో చెప్తున్నానని కేటీఆర్‌ పేర్కొన్నారు. పైసా సాయం చేయరు కానీ పని చేస్తున్న ప్రభుత్వానికి అవరోధం కలిగించడం సరికాదని కేటీఆర్‌ మండిపడ్డారు.

please subscribe this chanel smiling chaithu