Telugu News

విజయగర్జన జయప్రదం చేద్దాం : కేటీఆర్

నాలుగు రోజు కొనసాగిన తెరాస నియోజకవర్గ స్థాయి సమావేశాలు.

0

విజయగర్జన జయప్రదం చేద్దాం : కేటీఆర్

◆◆ నాలుగు రోజు కొనసాగిన తెరాస నియోజకవర్గ స్థాయి సమావేశాలు.

◆◆ సమావేశాల్లో మంత్రి కేటిఆర్ గారితో కలిసి పాల్గొన్న మంత్రిలు పువ్వాడ, జగదీశ్వర్ రెడ్డి

(హైదరాబాద్ -విజయం న్యూస్)

విజయగర్జన సభను జయప్రదం చేసేందుకు అందరు సిద్దంగా ఉండాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ, తెలంగాణ విజయ గర్జన కార్యక్రమాల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నియోజకవర్గస్థాయి ప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశాలు నాలుగవ రోజు కూడా కొనసాగాయి. ఆయా సమావేశాలలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,జగదీష్ రెడ్డి   పాల్గొన్నారు. గురువారం  తెలంగాణ భవన్ నందు మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ,యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి దశాబ్ది ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా ఈ సంబరాల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. 25వ తేదీన జరిగే పార్టీ ప్లీనరీ సమావేశానికి పార్టీ తరఫున ఎంపిక చేసిన ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణులకు ఆహ్వానం అందుతుందని ఈ సందర్భంగా కేటీఆర్  తెలిపారు.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుని ఎన్నిక తర్వాత పార్టీ ప్లీనరీ సమావేశం తర్వాత నవంబర్ 15వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి దశాబ్ది సందర్భంగా నిర్వహిస్తున్న తెలంగాణ విజయగర్జన భారీ బహిరంగ సభకు క్షేత్ర స్థాయి నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులు హాజరయ్యేలా చూడాలని ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించుకోవాలని కేటీఆర్ కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు ప్రణాళికలకు సంబంధించి కేటీఆర్ గారు ఆయా జిల్లాల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశాల్లో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ , జగదీష్ రెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు గారు, యంపి వెంకటేష్ నేతకాని గారు, మరియు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు  పార్టీ సీనియర్ నాయకులు సమావేశాల్లో పాల్గొన్నారు.

ALSO READ : – యాదాద్రికి మొదటి దాతగా కేసీఆర్