Telugu News

జనవరి 2న జిల్లాకు కేటీఆర్ రాకా

= ఆయనతోపాటే మంత్రులు పువ్వాడ, సత్యవతిరాథోడ్ పర్యటన

0

జనవరి 2న జిల్లాకు కేటీఆర్ రాకా
== ఆయనతోపాటే మంత్రులు పువ్వాడ, సత్యవతిరాథోడ్ పర్యటన
== మంత్రుల పర్యటనకు సంసిద్దంగా ఉండాలి
== అధికారులతో సమీక్ష సమావేశంలో
(ఖమ్మంప్రతినిది-విజయంన్యూస్)
రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖమంత్రి కె.తారకరామారావు ఖమ్మం జిల్లాలో పర్యటన ఖారారైంది. జనవరి 2న ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు రూట్ మ్యాఫ్ ను అధికారులు విడుదల చేశారు. మంత్రి కేటీఆర్ తోపాటు రాష్ట్ర గిరిజన, స్ర్తీ శిశుసంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించనున్నారు. ముఖ్యంగా ఖమ్మం నగరంలోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన అభివద్ధి పనులను మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమం చేయనున్నారు. ఇటీవలే రెండు నెలల క్రితం పర్యటించిన మంత్రి కేటీఆర్, ఖమ్మం నగరంలోని టేకులపల్లి గ్రామంలో నిర్మాణం చేసిన 1004 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు. అలాగే ఐటీ హబ్ రెండవ పేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తిరిగి జనవరి 2న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జనవరి 2వ తేదీన రాష్ట్ర మంత్రులు ఉదయం 10.00 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా ఖమ్మం నగరానికి చేరుకొని ఉదయం 10.15 గంటలకు రఘునాథపాలెం గ్రామంలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. అనంతరం ఉదయం 10.40 గంటలకు ఐ.టి. హబ్ సెంటర్ నందు ఫుట్ పాత్ ను ప్రారంభించనున్నారు.

ఉదయం 11.00 గంటలకు లకారం ట్యాంక్ బండ్ చేరుకొని సస్పెన్షన్ బిడ్జిని ప్రారంభించిన అనంతరం అర్బన్ పేద ప్రజలకు పట్టాల పంపిణీ చేయనున్నారు. తదుపరి ఉదయం 11.20 గంటలకు 26 వ డివిజన్ చర్చికాంపౌండ్ కూడలి సందరీకరణ పనులను ప్రారంభిస్తారు. ఉదయం 11.40 గంటలకు 17 వ డివిజన్ ప్రకాష్ నగర్ లో(ఎస్.టి.పి) సేవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులకు శంఖుస్థాపన చేసిన అనంతరం మధ్యాహ్నం 12.00 గంటలకు 59 వ డివిజన్ దానవాయిగూడెం నందు (ఎఫ్.ఎస్.టి)
ఫీకల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను మంత్రులు ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రారంభోత్సవాల కార్యక్రమం అనంతరం నగర అభివృద్ధి పనులపై మద్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్ లో సమీక్షా సమావేశంలో మంత్రులు పాల్గొననున్నారు.
== ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
జనవరి 2న జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఖరారు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైయ్యారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైయ్యారు. పోలీసులు బందోబస్తు పై పోలీస్ కమీషన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించి, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
== మంత్రుల పర్యటనకు అధికారులు, ఉద్యోగులందరు సంసిద్దంగా ఉండాలి : కలెక్టర్

జనవరి 2 వ తేదీన ఖమ్మం నగరంలో రాష్ట్ర మంత్రులచే జరుగనున్న ప్రారంభోత్సవ, శంఖుస్థాపనల పనులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రక్షా సమావేశ మందిరంలో అనుబంధ శాఖలు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జనవరి 2వ తేదీన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్, ఐ.టి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి నగరంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారని, సంబంధిత శాఖాధికారులు తమ శాఖలచే చేపడున్న పనులు సకాలంలో పూర్తి చేసి, సమగ్ర నివేదికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

ఇట్టి శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సమీక్షకు సంబంధించిన నివేదికలతో ఆయా శాఖాధిపతులు అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో
నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్న్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్.మదుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్యాంప్రసాద్, విద్యుత్ శాఖ డి.ఇ
రాములు, నగరపాలక సంస్థ పర్యవేక్షక ఇంజనీరు అంజనేయ ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు కృష్ణలాల్, రంగారావు, జిల్లా పర్యాటక శాఖాధికారి సుమన్ చక్రవర్తి, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం తహశీల్దార్లు శైలజ, నర్సింహారావు, సంబంధిత శాఖాధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

 

also read;-సీఎం పరువుపోతుందనే రేవంత్ ను అడ్డుకున్నారు