కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి : బండి సంజయ్
== లిక్కర్ స్కామ్ ను మరిచిపోయేందుకు లీకేజీ స్కామ్
== సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్
(కరీంనగర్-విజయంన్యూస్)
టి ఎస్ పి ఎస్ సి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ డ్రామాలకు తెరలేపారని, లిక్కర్ స్కామ్ ను మరిచిపోయేందుకే లీకేజీ స్కామ్ కు తెరలేపారని, పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. పదోతరగతి పేపర్ లీకేజీ విషయంలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన బండిసంజయ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం ఉదయం కరీంనగర్ సబ్ జైలు నుంచి బండి సంజయ్ విడుదల కాగా, ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: ఈటెల విచారణకు హాజరుకాండీ
ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడిన బండి సంజయ్, మంత్రి కేటిఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసినందుకు నాపై కుట్ర పన్నారు ఆని బండి సంజయ్ అన్నారు. ఆ ఇష్యూ ను డై వర్ట్ చేయడానికి కుట్రదారులు కె సి ఆర్,కె టి ఆర్ పది లీకేజీ డ్రామా అడుతున్నారన్నారు. దమ్ముంటే 10 పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టి పి పి ఎస్ సి లీకేజీ పై ఇదివరకే మేము చేసిన డిమాండ్ లతో తెలంగాణా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అన్నారు.మా అత్తమ్మ చనిపోయారు ఇంట్లో ఏడుస్తున్న సమయంలో పోలీసులు అతిగా ప్రవర్తించారు మా అత్తమ్మ నన్ను కన్న కొడుకుల చూసుకునేది, ఎంపీ అని చూడకుండా పోలి సులు వ్యవహరించిన తీరు భాదకలిసించుండన్నారు.
ప్రశ్నిస్తే పిచ్చి అంటున్నారు. వరంగల్ గడ్డపై భారీ ప్రదర్శన నిర్వహిస్తాం. ఇష్యూ డై వర్టు చేస్తున్నారు. దమ్ముంటే చర్చకు రావాలని బండి డిమాండ్ చేశారు. కె సి ఆర్ కొడుకు, బిడ్డ జైలు కు పోవడం ఖాయం, నేను వెంటపడుతా అంటూ ఘాటు విమర్శలు చేసారు బండి సంజయ్
ఇది కూడా చదవండి: త్వరలో ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటన