Telugu News

అమిత్ షాపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్

== మోదీ.. రూ. 100ల‌క్ష‌ల కోట్ల అప్పు ఎవ‌రి కోసం చేశారు? == అమిత్ షాకు కేటీఆర్ సూటి ప్ర‌శ్న‌

0

అమిత్ షాపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్
== మోదీ.. రూ. 100ల‌క్ష‌ల కోట్ల అప్పు ఎవ‌రి కోసం చేశారు?
== అమిత్ షాకు కేటీఆర్ సూటి ప్ర‌శ్న‌
(హైదరాబాద్-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసిండ‌ని అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి కేటీఆర్ త‌ప్పుబ‌ట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత 65 ఏండ్ల‌లో మొత్తం రూ. 56 ల‌క్ష‌ల కోట్లు అయితే.. మోదీ ఈ ఎనిమిదేండ్ల‌లో రూ. వంద‌ ల‌క్ష‌ల కోట్లు అప్పు చేసిండ‌ని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

రూ. 25 వేల కోట్లు మిష‌న్ భ‌గీర‌థ‌కు ఇచ్చామ‌ని అమిత్ షా చెప్పారు. రూ. 19 వేల కోట్లు గ్రాంట్ రూపంలో ఇవ్వాల‌ని నీతి ఆయోగ్ చెప్పింది. కానీ రూ. 19 కూడా కేంద్రం ఇవ్వ‌లేదు. అమిత్ షా నిన్న సిగ్గు లేకుండా మాట్లాడిండు. తెలంగాణ అప్పుల పాలై పోయింద‌ని ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడిండు. 28 రాష్ట్రాల్లో అప్పుల నిష్ప‌త్తిలో తెలంగాణ స్థానం 23వ స్థానం. అధికంగా అప్పులు తీసుకున్న‌ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే ముందు వ‌రుసులో ఉన్నాయ‌ని కేటీఆర్ తెలిపారు.

 

also read :-ఉద్యమాల పురిటిగడ్డ… చిన్న గూడూరు
== ప‌రిమితంగానే అప్పులు చేశాం..
తెలంగాణ అప్పు చేసినా ప‌రిమితంగానే, ఎఫ్ఆర్బీఎం నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అప్పు చేసింద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 2014 నాటికి ఈ దేశం యొక్క అప్పు రూ. 56 ల‌క్ష‌ల 69 వేల 428 కోట్లు.. కాగా ఇప్పుడు వ‌చ్చే సంవ‌త్స‌రం మార్చితో చూసుకుంటే ఒక వంద ల‌క్షల‌ కోట్లు అప్పు చేసిండు మోదీ. గడచిన 65 ఏండ్ల‌లో మొత్తం రూ. 56 ల‌క్ష‌ల కోట్లు అయితే.. మోదీ ఈ ఎనిమిదేండ్ల‌లో రూ. వంద‌ ల‌క్ష‌ల కోట్లు అప్పు చేసిండు. ఈ దేశాన్ని అప్పుల పాలు ఎవ‌రు చేస్తున్నారు? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు..?మ‌రి మీరు ఎవ‌రి కోసం అప్పులు చేశారు..? తెలంగాణ ప్ర‌భుత్వం అప్పు చేసినా కూడా మంచి పనుల‌కు వినియోగించామ‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ క‌ట్టినం. క‌రెంట్ బాగు చేశాం. కాళేశ్వ‌రం లాంటి ప్రాజెక్టు క‌ట్టి రైతుల బాధ‌లు తీర్చాం. మ‌రి మీరు ఎవ‌రి కోసం అప్పులు చేశార‌ని ప్ర‌శ్నిస్తున్నామ‌న్నారు కేటీఆర్. పెట్రోల్ డిజీల్ పై ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 26 ల‌క్ష‌ల కోట్లు వ‌సూలు చేశారు. బ‌డా బాబుల‌కు సంబంధించిన‌ రూ. 11 ల‌క్ష‌ల 68 వేల కోట్ల అప్పులు మాఫీ చేస్త‌రు. ఇది మీ బ‌తుకు. ఒక అస‌మ‌ర్థ ప్ర‌ధాని వ‌ల్ల ఇది జ‌రిగింది. కార్పొరేట్ శ‌క్తుల అప్పులు మాఫీ చేసి, పేద‌ల తోలు వ‌లుస్తున్నార‌ని కేటీఆర్ మండిపడ్డారు.

also read :- సాయిగణేష్ కుటుంబానికి అండగా ఉంటాం
== మా స్టీరింగ్ మా చేతుల్లోనే..
మా స్టీరింగ్ మా చేతుల్లోనే బ్ర‌హ్మాండంగా ఉంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. మీ స్టీరింగే కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లింది. మీ స్టీరింగ్ ఎవ‌రు న‌డుపుతున్నారో ప్ర‌జ‌లంద‌రికీ తెలుసునన్నారు. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన సంస్థ‌ల‌ను చేతిలో పెట్టుకుని, ఏజెన్సీల‌ను అడ్డం పెట్టుకుని ఆట‌లు సాగిస్తున్నారు. కానీ మీ ఆట‌లు సాగ‌వు. ఇది ప్ర‌జాస్వామ్యం.. అబ‌ద్ధాలు చెప్పి ఎక్కువ కాలం బ‌త‌క‌లేర‌ని కేటీఆర్ నిప్పులు చెరిగారు. డబల్ ఇంజన్ ఉన్న రాష్ట్రాల్లో పీకింది ఏంటో.. అక్కడి ప్రజల కష్టాలు చుస్తే తెలుస్తుంది. అచ్చేదిన్ అంటే అందరికి అనుకున్నా కొందరికే పరిమితం అని ఇప్పుడు తెలుస్తోంది.
రైతులను 13నెలలు గోస పెట్టిన వ్యక్తి నరేంద్రమోదీ నిజాం, నియంత కాదా!.రాజ్యాంగ విరుద్ధ వ్యతిరేక మాటలు అమిత్ షా మాట్లాడుతున్నారు. నీ అబ్బ అయ్య సొత్తు కాదు…గల్లా పట్టి మరి మెడలు వంచి ధాన్యం కొనిపిస్తాం. ప్లీజ్..ప్లీజ్..ప్లీజ్ అంటే అధికారం ఇస్తారా?..ప్లీజ్ అంటే ఇవ్వడానికి తంబాకు, లవంగం కాదని దుయ్యబట్టారు. పీఎం కిసాన్ పైసలు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నరేంద్రమోదీ రాజ్యాంగంలో అమృతం అనేదే లేదని, ఓవైసీ భుజాల పై తుపాకీ పెట్టి ఎన్ని రోజులు కాల్చుతారని ప్రశ్నించారు. 370 ఆర్టికల్ కు టీఆరెస్ మద్దతు ఇచ్చింది కూడా ఇవ్వలేదు అని అమిత్ షా అబద్ధాలు చెప్తున్నారని, బీజేపీకి దమ్ము ఉంటే పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. ప్రజల మద్దతుతో సరైన సమయంలో కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారా..? ముందస్తుకు వెళ్లేందుకు బీజేపీ కి అహలాటం ఉందేమో కానీ మాకు లేదని అన్నారు. కేంద్రంలో పరిధిలో ఉన్న పరీక్షలు ఉర్దూలో పెడతారు మేము పెట్టకూడదా?

also read :- వదల మంత్రి..నిన్ను వదలా == పువ్వాడ అజయ్ జైలుకు పోవుడు ఖాయం
మా తాతలు అప్పట్లో ఉర్దూలో మాట్లాడేవాళ్ళని అన్నారు. లీగల్ యాక్షన్ కచ్చితంగా ఉంటుందని, గోల్డెన్ తెలంగాణ మోడల్ ను దేశం ముందు పెడతామని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర కాదు..అబద్ధాల జాతర అని కొట్టిపాడేశారు.
సిగ్గు చరం లేకుండా నియామకాల గురించి మాట్లాడుతున్నారని, మేము స్టార్టుప్ అంటుంటే బీజేపీ మాత్రం ఫ్యాకప్ అంటోందని ఆరోపించారు. 16లక్షల ఉద్యోగ ఖాళీలు కేంద్రంలో పెట్టుకోని అమిత్ షా ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం శాఖల్లో ఎస్సి- ఎస్టీ పిల్లల ఉద్యోగాలు తీస్తోంది నిజం కాదా? అసమర్ధ- దద్దమ్మ ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు. మూడు సార్లు గుజరాత్ కు సీఎంగా నరేంద్రమోదీ ఏం చేశారని, అక్కడి ప్రజలు ఇప్పటికి కూడా నీళ్ల కోసం కొట్లాడుతున్నారని ఆరోపించారు.