నరేంద్రమోడీ ఓ పాసిస్టూ
== దోపిడిదారుల మూఠాకు నాయకుడు ఆయన
== కేసీఆర్ నైజాం దొర.. మోదీ హిట్లర్
== ప్రధానికి తెలంగాణలో తిరిగే నైతిక హక్కులేదు
== భారతదేశంలోనే మోసపూరిత ప్రధాని నరేంద్రమోడీ
== ప్రధానిపై విరుచుకపడిన కూనంనేని
== సింగరేణి ప్రైవేటీకరణ చేయమంటూనే మైన్స్ లను కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్న మోదీ
== పొత్తులు మునుగోడు వరకే .. సింగరేణి ఎన్నికల్లో పొత్తులుండవు
== విలేకర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ఖమ్మంప్రతినిది, నవంబర్ 13(విజయంన్యూస్):
ప్రధాని నరేంద్రమోడీ ఓ పాసిస్టూ అని, పుట్టు అబద్దాల కోరు, ఇంతటి అబద్దాలు అడే ప్రధానిని భారతదేశంలో ఎప్పుడు చూడలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఖమ్మం జిల్లా సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ రామగుండం వస్తున్న సందర్భంగా గో బ్యాక్ మోడీ అంటూ కమ్యూనిస్టు పార్టీలు నినాదం చేసి ఆందోళన చేయడం జరిగిందన్నారు. ప్రధానిగా భారతదేశంలో ఎక్కడైన తిరిగే అవకాశం ఉంటుందని, అందులో తప్పేమిలేదన్నారు. అయితే గడిచిన 8ఏళ్ల కాలంలో ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని అన్నారు.
ఇది కూడ చదవండి: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా ఏం ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని ప్రజల పక్షాన కమ్యూనిస్టు పార్టీగా ప్రశ్నించామని, ప్రశ్నించడమే తప్పా..? అని అన్నారు. దీంతో నాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 7వేల మంది సీపీఐ, మహిళ, కార్మిక, విద్యార్ధి సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. నిన్న ప్రధాని మోదీ పర్యటన ప్రజాస్వామ్య స్ఫూర్తి విరుద్ధంగా సాగిందన్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ రాజ్యాంగని ఆవిత్ర చేస్తూ మోదీ పర్యటన సాగిందని ఆరోపించారు. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలనుతిట్టాని వాళ్ళు లేరు, ఎరువుల పరిశ్రమ ఓపెనింగ్ చేస్తుంటే కమ్యూనిస్టు అడ్డుకున్నారు అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఒక వేపు జాతికి అంకితం అంటూ అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేస్తూ అమ్ముకుంటు ధారాదత్తం చేస్తుంటే ఎందుకు అడ్డుకోకూడదా..? అని ప్రశ్నించారు. రామగుండం ఎరువులు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయము అని హామీ ఇవ్వమని అడిగాం తప్పా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలు అమ్ముతున్న వాళ్ళు…. ఎరువుల పరిశ్రమను జాతికీ అంకితం చేస్తున్నాము అంటే నమ్మాలా..? అని విమ్మర్శించారు. మోదీ పాలన లో దేశం అధోగతి లో పయనిస్తోందని ఆరోపించారు. దేశ సంపద కొంత మంది చేతుల్లోకి వెళ్లి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం ఐన్నదని,, దోపిడీ దారుల బృందాలకు నాయకుడు మోదీ అని ఆరోపించారు. వేల కోట్ల తో ఎమ్మెల్యేలను కొంటూ దోపిడీ దారులు అని ఆరోపణలు చేస్తున్న మోదీ మోసగాడు, అబద్ధాల కోరు దేశంలో ఎవరు లేరని, దేశ ప్రధానిగా ఒక నిమిషం అధికారంలో ఉండే హక్కు లేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: రాజీవ్ హత్యకేసు సుప్రీంకోర్టు సంచలన తీర్పు
దక్కన్ పాలనా జరిగిన అగ్రిమెంట్ ప్రకారం గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ నిధులు ఉన్న అది సింగరేణి కీ చెందుతుందని, అది చరిత్ర చెబుతుందన్నారు. సింగరేణిలో 51 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉంటే ప్రైవేటీకరణ ఎలా సాధ్యమని ప్రధాని చెబుతుండటం, సింగరేణి పరిధిలోకి వచ్చే మైన్స్ ను, కోల్డ్ లను విభాగాలుగా విభజించి టెండర్లకు పిలవడమేంటని ఆరోపించారు. కోయగూడం కోల్డ్ మైన్ ను విభన చేసి రూ.24,000 కోట్లతో అరవిందో కంపెనీకి సింగిల్ టెండర్ కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి అల్లుడికి అప్పగించలేదా..? ఇది నిజం కాదా…? అని ప్రశ్నించారు. శ్రావణపల్లి, మందమర్రి, కల్యాణగని, ఓసీ3, జేవీఆర్ లను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రపన్నుతున్నది వాస్తవం కదా..? అని ప్రశ్నించారు. సింగరేణి సంస్థ రూ.400 కోట్లు ఖర్చుతో బొగ్గు అన్వేషణ కోసం తమ సొంత నిధులను ఖర్చు చేసిందని ఆరోపించారు. సింగరేణి నీ ప్రవేట్ పరం చేసే హక్కు కేంద్రానికి లేదని అబద్ధాలు చెబుతూ మోదీ, అనేక కంపెనీలకు అప్పచెప్పేందుకు కుట్ర చేస్తున్నాడని దుయ్యబట్టారు. సంపద కాపాడటం మా వంతు బాధ్యతగా ఉద్యమాలు చేస్తామని అన్నారు.
== మునుగోడు వరకే టీఆర్ఎస్ తో పొత్తులు
మునుగోడు ఉప ఎన్నిక విషయంలో బీజేపీని ఓడించడం కోసమే టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్నామని, తద్వారా బీజేపీ స్పీడ్ ను తగ్గించగలిగామని అన్నారు. కమ్యూనిస్టుల వల్ల టీఆర్ఎస్ గెలిచిందనేది మునుగోడు ఉప ఎన్నిక నిరూపించిందన్నారు. అయితే టీఆర్ఎస్ తో పొత్తు కేవలం మునుగోడు వరకేనని, భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయమైన జాతీయ పార్టీ చూసుకుంటుందన్నారు. త్వరలో సింగరేణి ఎన్నికలు జరగబోతున్నాయని, ఆ ఎన్నికలకు టీఆర్ఎస్ అనుబంద కమిటీలతో ఏఐటీయుసీ కార్మిక సంఘం పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఎప్పటికి సీపీఐ పార్టీ కార్మికులు, కర్షకుల పక్షాన ఉంటుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకంగా ఉంటే, ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే కచ్చితంగా వ్యతిరేకిస్తామని అన్నారు. ఒకానోక దశలో కేసీఆర్ నిజాం దోర అయితే మోడీ హిట్లర్ లాంటి వాడని ఆరోపించారు. హిట్లర్ ను కొట్టడానికి దొరలేంతమందినైనా కలుపుకుని పోవాల్సిన అవసరం ఉంది కాబట్టే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. సింగరేణిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. కోయగూడ కోల్డ్ పనులను సీపీఐ పార్టీ అడ్డుకుంటుందన్నారు.
ఇది కూడా చదవండి: గో బ్యాక్ ప్రధాని అంటూ ధర్నా