Telugu News

తుమ్మలకు కురుక్షేత్ర యుద్దమే

కృష్టార్జున విజయానికి కాంగ్రెస్ సరైనా వేదిక"

0

తుమ్మలకు కురుక్షేత్ర యుద్దమే

== కృష్టార్జున విజయానికి కాంగ్రెస్ సరైనా వేదిక”

== “నిరంతర శ్రమజీవి తుమ్మల

== జిల్లా రాజకీయ విజయానికి శ్రమించక తప్పదా..?

== రాజకీయ, సామాజిక వేత్త లోడిగ. వెంకన్నయాదవ్.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014ముందు అప్పటి టిఆర్ యస్ కేవలం 1,55,000 ఓటింగ్ మాత్రమే ఉండగా తుమ్మల నాగేశ్వరరావు  చేరిక ఒక ప్రబంజనంలా ఖమ్మంజిల్లా గులాబీ మయమైందని చెప్పడం లో ఎలాంటి సందేహంలేదు. దానికి నిదర్శనం తుమ్మల చేరిక అనంతరం జరిగిన ఎన్నికల ఓటింగ్  6,75,000 చేరుకొంది. అంతేకాదు సర్పంచ్ లు , యం.పి.టి.సి.లు, కార్పోరేటర్లు , ఏకమొత్తంగా చేరడంతో రెండుసార్లు యంయల్ సిలు గెలవడానికి దోహదపడింది. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో జిల్లాపరిషత్ ,మున్సిపాలిటీలపై గులాబీ జెండా రెపరెపలాండి. గ్రామ మండల జిల్లా శాఖలు ప్రతిష్టాత్మక మైన పార్టీ నిర్మాణం లో తుమ్మల పెద్ద సహసమేచేశారు అని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి:- జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?

తుమ్మలపై కొంతమంది ఈరోజు అనేక కుంటి సాకులు చెప్పవచ్చు. ఓడిపోయి ఉంటే పిలిచి మంత్రిపదవి ఇచ్ఛారు అని ఈరోజు కొందరు తేలికగా మాట్లాడవచ్ఛు. కాని టిఆర్ యస్ నుండి బి.ఆర్. యస్ గా మార్పు చేసి ఖమ్మం లో పెట్టిన ఆవిర్భావ సభ చూసినప్పుడు తెలుస్తోంది తుమ్మల పార్టీ నిర్మాణం కొరకు చేసిన కష్టం ఎంతో కనపడుతుంది. ఏమిలేనిచోట పార్టీ నిర్మాణం కొరకు ఉభయఖమ్మం జిల్లాలో తన అభిమానులను వెంటబెట్టుకుని వాజేడు నుండి పాలేరు వరకు తుమ్మల పార్టీ కొరకు చేసిన కృషి  నిదర్శనమైతే కేసీఆర్ కూడ ఆనమ్మకంతోటే బిఆర్ యస్ఆవిర్భావ సభను ఖమ్మం ఎంచుకొన్నారు.

ఇవన్నీ తెలిసి కొంతమంది ని సంతృప్తి పరచడానికి తుమ్మలను పావుగా వాడుకొని తుమ్మలకు ఉన్న 40 సంవత్సరాల అనుభవాన్ని అమానుషంగా అవమాన పరిచిపొమ్మనకుండా పొగపెట్టిన తీరు బాదాకరంగా జిల్లా ప్రజల్లో నిరసన జ్వలలు వెల్లువిరిసాయి.తుమ్మల అభిమానులు రగిలిపోతున్నారు అనడానికి తుమ్మల స్వాగతం పలికిన తీరు నిదర్శనం. కేసీఆర్ తుమ్మల విషయంలో పెద్ద తప్పు చేశారు అని జిల్లాలో ప్రతినోట వినిపించడానికి కారణం అయ్యారు.

ఇది కూడా చదవండి:- అసెంబ్లీకి ముహుర్తం ‘డిసెంబర్ 6’..?

ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తుమ్మలకు రాజకీయంగా పెను సవాల్ అని చెప్పవచ్చు. జరగబోయే పరిణామాలు తుమ్మలకు రాజకీయ కురుక్షేత్రాన్ని తలపించేలా ఉంది. ఎందుకంటే తన 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయజీవితం నుండి నిష్క్రమించాలని అనుకున్న సమయంలో కనిపించని కుట్రలతో రాజకీయ కుతంత్రాలకు బలైపోయిన తుమ్మల ఓటమి పాలై ఇంటికెళ్లడం జిల్లాలో ఏవక్కరు జీర్ణించుకోలేక పోయారు. తుమ్మల మళ్ళీ పోటీ చేసి తాను అనుకున్న సీతారామా ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఉమ్మడి ఖమ్మంజిల్లాలో రైతుల మోహంలో చిరునవ్వు చూసి తాను రాజకీయ రిటైర్మెంట్ చేయాలన్న బలమైన కోరికకు కేసీఆర్ ఇప్పుడు ద్రోహం చేశారు అనే బావన తుమ్మల అభిమానులలో జిల్లా ప్రజలలో గూడుకట్టుకొని ఉంది.కాంగ్రెస్ లో చేరి మళ్ళీపోటీ చేసి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని  జిల్లా అభిమానులు ప్రజలు బహిరంగా తుమ్మలకు చెప్పి తన ప్రమేయం లేకుండానే కాంగ్రెస్ వైపు అడుగులు వేసేలా తుమ్మలను చేశాయి. పోరాడి ఖమ్మంజిల్లాలో కాంగ్రెస్ పార్టీని రాజకీయ విజయం అందించి తిరిగి తన లక్ష్యసాదలో ఏకలవ్య అంకుటిత దీక్షతో మరో కురుక్షేత్ర సంగ్రామం లో రాజకీయ యుద్ధం ఇప్పుడు తుమ్మలకు సహసమే అయినప్పటికీ తన రాజకీయ బౌషత్ కొరకు జిల్లా ప్రజల ఆకాంక్ష తో  తప్పనిసరి అని చెప్పవచ్ఛు.

ఇది కూడా చదవండి:- తైతక్కలు ఆడితే ప్రజలు నమ్ముతారా..?: మంత్రి

అయితే అప్పుడు టిఆర్ యస్ లో చేరిన పరిస్థితి కి ఇప్పుడు కాంగ్రెస్ లో తుమ్మల చేరుతున్న పరిస్థితి కి కొంత వెత్యాసం కనపడుతుంది.

జిల్లాలో ఆనాడు టీఆరెస్ అంతంత మాత్రంగానే ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ కు బలమైన ఓటింగ్ ఉంది.కేసీఆర్ పై వెతిరేకత తో పాటు తుమ్మల కు అన్యాయం జరిగిందని ప్రజల్లో సానుభూతి ఉంది. వీటికి తోడు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తుమ్మలకు జతకడుతున్నారు. కాబట్టి కేసీఆర్ పై కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ కురుక్షేత్రమహ సంగ్రామంలో తుమ్మల పొంగులేటి కృష్టార్జున పోరాటం లో ఇద్దరి కలయిక బలమైన శక్తి గా చెప్పవచ్చు. ఇద్దరి సామాజిక వర్గానికి తోడు మల్లు బట్టివిక్రమార్క పెద్దన్నగా తోడు ఉండటం తుమ్మలకు రాజకీయంగా లాబించే అంశం గా చెప్పవచ్చు.10 సంవత్సరాలు గా కాంగ్రెస్ కార్యకర్తలు అధికారంలేక ఈసారి ఎలాగైనా మనం అధికారంలోకి రావాలన్న ఖసి , పట్టుదలతో కార్యకర్తలు ఉన్నారు. ఈ మొత్తం పరిణామాలు రాజకీయ విశ్లేషణ భాగంగా జిల్లా లో పొంగులేటి పదికిపది శభదం సాదించేందుకు తుమ్మల చేరిక ఎంతగానో దోహదపడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.కాని జిల్లాలో నాయకులు ఐఖ్యశంకారావం పూరించాలని ప్రజలు కోరుకొంటున్నారు.