గ్లోబల్ రెయిన్ బో స్కూల్ లో ఘనంగా కృష్ణా ష్టమి వేడుకలు
== కృష్ణా,గోపిక వేషాదారణలో పిల్లలు సందడి
కూసుమంచి, ఆగస్టు 20(విజయంన్యూస్)
కూసుమంచి మండలంలోని గ్లోబల్ రెయిన్బో స్కూల్ లో కృష్ణా ష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యార్థిని విద్యార్థులు గోపిక, కృష్ణుని వేషధారణలో పాఠశాలకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఉట్టి కార్యక్రమంలో గోపిక, కృష్ణుని వేషధారణలోని పిల్లలు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ ఇర్షాద్ మాట్లాడుతూ.. భారతదేశ సంస్కృతి సంప్రదాయా లు లు విద్యార్థులకు తెలియజేసేందుకు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగింది అన్నారు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణుడు అనుసరించిన విధానాలు తెలియజేయడం కృష్ణాష్టమి లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ , స్కూల్ ఇన్ చార్జ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ALLSO READ- తమ్మినేని క్రిష్ణయ్యను హత్యచేసిన నిందితులు అరెస్టు..రిమాండ్..?