ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం
== మంత్రులు సమక్షంలో ప్రమాణం చేయించిన స్పీకర్
(హైదరాబాద్ -విజయం న్యూస్)
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో ఆయనతో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖామంత్రి కేటీఆర్, సహచర మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి పాల్గొని ఎమ్మెల్యే కూసుకుంట్లకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
ఇది కూడా చదవండి తుమ్మల ప్రజా…ప్రస్థానం @ 40