Telugu News

కూసుమంచి లో రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి

మ‌రోక‌రి గాయాలు

0

రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి
== మ‌రోక‌రి గాయాలు
== కేసు న‌మోదు చేసిన పోలీసులు
(కూసుమంచి-విజ‌యంన్యూస్‌)
రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెంద‌గా, మ‌రోక‌రు తీవ్రంగా గాయ‌పడిన సంఘ‌ట‌న గురువారం కూసుమంచి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కూసుమంచి మండ‌లం, గైగొళ్ల‌ప‌ల్లి పంచాయ‌తీ చింత‌లతండాకు చెందిన వీర‌న్న‌(45) , మ‌రోకరితో క‌లిసి త‌న మోట‌ర్ సైకిల్ పై కూసుమంచికి బ‌య‌లుదేరాడు. మార్గ‌మ‌ద్య‌లోని కూసుమంచి గ్రామంలో మోట‌ర్ సైకిల్ అదుపుత‌ప్పి కింద‌ప‌డిపోయింది. దీంతో మోట‌ర్ సైకిల్ పై ప్ర‌యాణిస్తున్న వీర‌న్న అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా, గాయ‌ప‌డిన క్ష‌త‌గాత్రుడ్ని ఖ‌మ్మం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న కూసుమంచి ఎస్ఐ నందీఫ్ త‌న సిబ్బందితో క‌లిసి అక్క‌డికి చేరుకోగా, మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖ‌మ్మం ప్రభుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు.

allso read- టీఆర్ఎస్ ఇక నుంచి బీఆర్ఎస్

** పోలీసులపై తిరగబడిన జనం

కూసుమంచి మండల కేంద్రంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరన్న వ్యక్తి తీవ్రంగా గాయపడి ఉండగా స్థానికులు 108 వాహనానికి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. గంటన్నర సమయం అయినప్పటికీ పోలీసులు, అంబులెన్స్ రాకపోవడం వలన వీరన్న చనిపోయాడు. దీంతో స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడకు వచ్చిన ఏఎస్ ఐ, కానిస్టేబుల్ పై పోలీసులపై స్థానికులు మండిపడ్డారు. మీ వల్లనే క్షతగాత్రుడు చనిపోయాడని, దీనికి మీరే బాధ్యత తీసుకోవాలని పోలీసులను నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న కూసుమంచి ఎస్ ఐ నందీప్ సంఘటన స్థలానికి వచ్చి స్థానికులతో మాట్లాడి నచ్చజెప్పి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు