Telugu News

*మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడం ఎంతో ఆనందదాయకం

వార్డు సభ్యుడు ఎస్.వేణు, బెల్లంకొండ శరత్, అబ్దుల్లా.

0

*మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడం ఎంతో ఆనందదాయకం –

** వార్డు సభ్యుడు ఎస్.వేణు, బెల్లంకొండ శరత్, అబ్దుల్లా..*

కూసుమంచి, అక్టోబర్ 14 : కూసుమంచి మండల కేంద్రంలో గల బంధన్ స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయంలో ఏర్పాట చేసిన, మహిళా ధారిత కుటుంబాలకు, బంధన్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, మండల పరిధిలోని పలు గ్రామాల్లో. అర్హలైన మహిళలకు ఉచితంగా కిరాణా షాపు, వ్యాపార నిమిత్తం వస్తువులు, కుట్టు మిషన్లు, దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంకొండ శరత్, ఎస్ వేణు ఒంటరి మహిళలకు బట్టలు సామాగ్రి, మరియు ఫ్యాన్సీ ఐటమ్స్, కిరాణం పంపిణీ చేశారు.

ఇది కూడా చదవండి:- ఇల్లందుకు పీసీసీ మెంబర్లుగా వీరేనా..?

ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ. మహిళా ధారిత కుటుంబాలకు బంధన్ స్వచ్చంద సేవా సంస్థ చేస్తున్న ఆర్థిక సేవ చేయటం ఎంతో ఆనందదాయకం అన్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఒంటరి మహిళలు ఒకరిపై ఆధారపడకుండా, చిరు వ్యాపారులు చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని. పిల్లలను ఉన్నత చదువులు చదివియాలని వారు ఆకాంక్షించారు. ఒంటరి మహిళలు మంచిగా వ్యాపారం చేసుకుంటే. ఇంకా ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తే వారు ఆర్ధికంగా లాభం పడతారని సూచించారు. ఈ కార్యక్రమంలో బంధన్ స్వచ్చంద సేవ సంస్థ కూసుమంచి మండల శాఖ సిబ్బంది. బ్రాంచ్ మేనేజర్ అబ్దుల్లా, టీమ్ లీడర్ కైలేష్ బవరి తదితరులు పాల్గొన్నారు..

Allso read-ఖమ్మం పట్టణంలో రెచ్చిపోతున్న దొంగలు