Telugu News

కూసుమంచిలో రోడ్డు ప్రమాదాలు

వేరువేరు చోట రెండు ప్రమాదాలు.. నలుగురికి గాయాలు

0

కూసుమంచిలో రోడ్డు ప్రమాదాలు

== వేరువేరు చోట రెండు ప్రమాదాలు.. నలుగురికి గాయాలు

(కూసుమంచి-విజయంన్యూస్)

కూసుమంచి మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కూసుమంచి మండలంలోని పాలేరు-నాయకన్ గూడెం సమీపంలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో రెండు మోటర్ సైకిళ్లు ఎదురేదురుగా ఢీకొనడంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. నాయకన్ గూడెం గ్రామానికి చెందిన టీవీఎస్ వాహనంపై వెళ్తున్న వ్యక్తికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు తక్షణమే 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే కూసుమంచి మండలంలోని కిష్టాపురం రోడ్డులో గంగమ్మగుడి సమీపంలో రోడ్డు వర్క్ జరుగుతుండగా అక్కడ ఉన్న కంకర వద్ద మోటర్ సైకిల్ అదుపుతప్పి పడిపోయింది. దీంతో పోచారం గ్రామానికి చెందిన సలవాది ఉపేందర్ మోటర్ సైకిల్ పై కూసుమంచి నుంచి పోచారం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఉపేందర్ కు స్వల్పగాయాలైయ్యాయి. ఆయన్ను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

allso read- బంగ్లాపై భారత్ ఘనవిజయం