Telugu News

భట్టి పాదయాత్రలో పాల్గొన్న కూసుమంచి కాంగ్రెస్ నేతలు

100రోజులు పూర్తి సందర్భంగా భట్టికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

0

భట్టి పాదయాత్రలో పాల్గొన్న కూసుమంచి కాంగ్రెస్ నేతలు

== 100రోజులు పూర్తి సందర్భంగా భట్టికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

(కూసుమంచి-విజయంన్యూస్)

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పిపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతుండగా కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పాదయాత్రలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి మండలంలో 100 వ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గత రెండు రోజుల క్రితం అస్వస్తతకు గురై తిరిగి పాదయాత్రను ప్రారంభించగా, జోరు వర్షంలో కూడా భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించారు. ఒక వైపు జ్వరం తగ్గలేదు, మరో వైపు జోరు వర్షం వస్తుందని, పాదయాత్ర రెండు రోజులకు వాయిదా వేయాలని నాయకులు, కార్యకర్తలు కోరినప్పటికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగించారు.

ఇది కూడా చదవండి: షర్మిళ..విలీనామా..? విహారమా..?

ఈ పాదయాత్రకు కూసుమంచి మండలం నుంచి సీనియర్ నాయకులు పెండ్ర అంజయ్య, బొంగానాయక్, యువజన కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బెల్లి శ్రీశైలం, ఎన్ఎస్ యూఐ జిల్లా కార్యదర్శి బానోతు హరినాథ్, గిరిజన సంఘం నాయకులు బానోతు రమేష్ నాయక్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాదావత్ నరేష్, సోషల్ మీడియా మండల ఇంచార్జ్ బెజవాడ రేవంత్ రెడ్డి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు. సీఎల్పీ నేత భట్టి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ త్వరలో ఖమ్మం జిల్లాలో జరిగే పాదయాత్రను, బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్కరు కంకణబద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు.