Telugu News

బూతు పురాణంపై స్పందించిన ఇంటూరి శేఖర్

రికార్డులో ఉన్నది నా వాయిస్ కాదు

0

బూతు పురాణంపై స్పందించిన ఇంటూరి శేఖర్

== రికార్డులో ఉన్నది నా వాయిస్ కాదు

== రాజకీయంగా అణగదొక్కేంద్కుకు కుట్ర

== ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోని విలేకర్ల సమావేశంలో స్పష్టం పేర్కొన్న డీసీసీడీ డైరెక్టర్

కూసుమంచి,ఆగస్టు 14(విజయంన్యూస్)

కూసుమంచి మండలం జీళ్ళచెరువు  పంచాయతీ పై ఆర్టీఐ విషయంలో సంచలనంగా మారిన బూతు పురాణం ఆడియోపై డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ స్పందించారు. రికార్డులో ఉన్నది నా వాయిస్ కానే కాదని, ఇమిటేడ్ చేసి గ్రూపులలో పోస్టు చేశారని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నఆర్టీఐ వేసిన సురేష్ పై బూతు పురాణం ఆడియో విషయం ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. ఈ మేరకు అన్ని మీడియాల్లో ప్రచురితం కాగా, బాధిత వ్యక్తి సురేష్ ముదిగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయంపై స్పందించిన డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ఆదివారం పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి క్యాంఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇది కూడా చదవచ్చో: పాలేరు ఎమ్మెల్యే అనుచరుడి బూత్ పురాణం

ముదిగొండ మండలం యడవల్లి గ్రామానికి చెందిన దున్నపోతుల సురేష్ అనే వ్యక్తి కూసుమంచి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆర్టీఐ పిటషన్లు వేసి సర్పంచులను, అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపారు. అంతే కాకుండా పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇలాగే ఆర్టీఐ పిటషన్లు వేస్తున్నాడని అన్నారు.  ఇప్పటికే అనేక గ్రామ పంచాయతీల్లో ఆర్టీఐ పిటిషన్ వేసి సర్పంచుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నాడని పేర్కొన్నాడు. సర్పంచ్ లను,అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని, సర్పంచులు, అధికారులు తమ విధులను కూడా సక్రమంగా చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సురేష్ తో నేను పోన్ లో మాట్లాడిన వాయిస్ నాది కాదని స్పష్టం చేశారు. కావాలనే కొందరు రాజకీయంగా నన్ను అణగదొక్కే కుట్ర జరుగుతుందని, అందులో భాగంగానే నా వాయిస్ ను ఇమిటేడ్ చేసి, సురేష్ ను తిట్టినట్లుగా మాట్లాడి వాట్సఫ్ గ్రూపులలో వేస్తున్నాడని, దీంతో విలేకర్లు, మీడియా వారు అసలు విషయం తెలుసుకోకుండా వార్త కథనాలను ప్రచురితం చేశారని అన్నారు. సమాచారం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది,కానీ ఇలా ప్రతి గ్రామపంచాయతీ లో వేసి ఇబ్బందులు పెట్టాల్సిన పనిలేదని అన్నారు. అధికారులు సమాచారం ఇవ్వాల్సి ఉండగా సర్పంచ్ లకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదన్నారు. దళితులు అంటే నాకు గౌరవం ఉందని,

ఇది కూడా చదవండి: మునుగోడు కు సీఎం కేసీఆర్… ఎప్పుడంటే..?

కావాలని కొన్ని శక్తులు రాజకీయంగా అనగదొక్కేందుకు కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి సంబంధం లేని విషయాల్లో ఆయన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారని తెలిపారు. కులాలు, మతాలు చూడకుండా ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అందరికీ సహాయం చేస్తున్నారని తెలిపారు. రాజకీయాల్లో  ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలని ఇలాంటివి వాడుకోవడం పద్ధతి కాదని, రాజకీయంగా అణగదొక్కాలనే కుట్ర చేసేవారు పద్దతి మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు హాజరైయ్యారు.