Telugu News

కూసుమంచి మండలంలో మాజీ ఎంపీ పొంగులే పర్యటన*

పలువుర్ని పరామర్శించిన పొంగులేటి 

0

*కూసుమంచి మండలంలో మాజీ ఎంపీ పొంగులే పర్యటన*

** పలువుర్ని పరామర్శించిన పొంగులేటి 

(కూసుమంచి-విజయం న్యూస్)

తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కూసుమంచి మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని నాయక గూడెం గ్రామానికి చెందిన కంచెర్ల వీరారెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయన్ను పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Allso read:- రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు…

త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వినాయక మండపాలను సందర్శించారు. జక్కేపల్లిలో యానాల వెంకట్ రెడ్డి, నల్లా నర్సిరెడ్డి, కొత్త వెంకట్ రెడ్డి, సోమిరెడ్డి నర్సింహారెడ్డి, కొత్త జానయ్య, వీరాస్వామి, దుస్స రాంతులసమ్మ, ఎస్.వి.రెడ్డి కుటుంబాలను పరామర్శించారు. అదేవిధంగా పెరిక సింగారంలో కొత్త వీరా రెడ్డి చనిపోగా కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. కొత్తూరులో పోలెబోయిన పుల్లయ్య, పోలెబోయిన చిన్న కోటయ్యలు ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాలను ఓదార్చారు.

Allso read:- మునిగేపల్లికి ఆర్టీసీ బస్సు..ప్రారంభించిన ఎమ్మెల్యే కందాళ

కూసుమంచి గ్రామానికి చెందిన పార్టీ నాయకులు బారి వీరభద్రం రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయన్ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వీటితో పాటు మరికొన్ని ప్రయివేటు కార్యక్రమాలకు పొంగులేటి హాజరయ్యారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట తెరాస రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కొమరెల్లి ఆలింగా, గోవిందరెడ్డి, బజ్జూరి వెంకటరెడ్డి, జూకూరి గోపాలరావు, బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, కేశవరెడ్డి, దేవర అమల, బారి శ్రీను, రామ్ కుమార్, మారోజు భీష్మాచారి, వీరారెడ్డి, లక్ష్మారెడ్డి, జీవన్ రెడ్డి, కందాల రవి, భూక్యా బాలు, బానోతు ఉపేందర్, యాసా విష్ణువర్ధన్ రెడ్డి, కొండ మహిపాల్, గుండా దామోదర్ రెడ్డి తదితరులు ఉన్నారు.