Telugu News

మిట్టరాత్రి గూటిలోకి..

వద్దు వద్దంటున్న అధికారులు.. బయటకు పోవుడే లేదంటున్న లబ్ధిదారులు

0

మిట్టరాత్రి గూటిలోకి

== గట్టుసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి పోయిన లబ్ధిదారులు

== కొన్నిండ్లకు తాళాలేసిన రెవెన్యూ అధికారులు

** ఇన్నేళ్లు గుడిసేలో ఉండలేక చచ్చినం

** సర్కార్ ఇళ్ళిస్తదంటే మస్తుగా కుషి అయినం

** అయినప్పటికి ఎన్నేళ్ళైన ఇస్తలేరు..?

** అందుకే అందరం మిట్టరాత్రి ఇండ్లళ్లోకి పోయినం

** పూరిగుడెసలా బాదపోయింది..

** సర్కార్ సహాయంతో మస్తుగా బతుకుతం

** గట్టుసింగారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు సంబురం

(పెండ్ర అంజయ్య , కూసుమంచి-విజయం న్యూస్)

ఇన్నేళ్లు మేము గుడిసల్లో ఉన్నము.. వానత్తే కురుసుడు.. ఎండోస్తే ఉక్కపోచుడు.. అయినం ఏం చేస్తం.. డాబాల బతకాలని మాకు ఆశ ఉంది.. కానీ మేమేమో గుడిసేల్లో ఉంటుంటిమి.. కట్టుకుందామంటే మస్తు పైసలైయితయ్.. మేమేక్కడ నుంచి తేవాలే..? దినాం కూలికి పోతే వచ్చే పైసలతోనే ఇళ్లు గడువుడు కష్టమాయే.. ఇక దాబాలు కడుతమా..? మా బతుకులు ఇట్టేనే ఉంటయని అనుకున్నం. కానీ కేసీఆర్ గవర్నమెంట్ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల అత్త అన్నరు.. మాకు మస్తు సంబరమైంది.. మూడేళ్ల నుంచి ఇళ్లు కడుతున్నరు.. పోయినేడాది లిస్ట్ చెప్పిర్రూ.. అందులో మాపేర్లు అచ్చే సరికి మస్తు సంబరమైంది.. ఇక పూరిగుడిసే బతుకులు పోయినట్లే అనుకున్నం.. ఎంత సంతోష పడ్డమో మేమంతా..? ఇక పది రోజుల్లో అస్తయి ఇండ్లు మీకు అన్నరు.. ఇక వచ్చుడే అనుకున్నము..కానీ వాళ్లు,వీళ్లు  ఆపేరు రాలే..ఈ పేరు రాలే అని లొల్లి పెట్టుకున్నరు.. దీంతో పెద్ద సార్లు పేర్లు చదివిర్రూ కానీ.. ఇప్పటితాన మాకు ఇండ్లు ఇయ్యలే.. ఇగ ఎన్నాళ్లుండా ఇట్టనే.. అని అందరం అనుకున్నం. శనివారం మిట్ట రాత్రి అందరి ఇండ్లలోకి వచ్చినమ్.. ఇగ వచ్చిన కాడ నుంచి రెవెన్యోళ్లు.. పోలీసోళ్లు.. మా సర్పంచు… మా ఊళ్లో పెద్దమనుషులు పోన్లే పోన్లు.. మీరు అట్టబోవోద్దు.. అధికారులోచ్చి మీకు ఇస్తరు.. మీరు బయటకు రాండ్రీ అని చెబుతున్నరు.. ఇంకేన్నాళ్లు ఎదురు చూడాలయ్య..మీరే చెప్పుర్రీ..? అందుకే ఇండ్ల నుంచి పోయేటిదే లేదు.. ఎవళ్లేమైనా చేసుకుని. మా పాణమైనా ఇస్తం కానీ ఇండ్ల కాడ నుంచి పోవుడే లేదు.. ఇది గట్టుసింగారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఆవేదన. శనివారం రాత్రి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో లబ్ధిదారులు గ్రుహప్రవేశం చేసిండ్రని తెలుసుకున్న విజయం ప్రతినిధి అక్కడకు వెళ్లి లబ్దిదారులతో మాట్లాడిండూ.. వాళ్లను కదిలిస్తే కన్నీళ్లు వచ్చినయ్.. పేదోళ్లమే కదా..? మాకు ఇళ్లోస్తే ఎందుకు అడ్డం పడుతున్నరు అంటూ కొందరు కంటతడి పెట్టుకున్నరు. అసలు కథ ఏంటో పూర్తి వివరాలు చదువుదామా..?  ఇగ చదువుర్రీ..       allso read –సత్తుపల్లిలో విద్యార్థుల ఫైట్

కూసుమంచి మండలంలోని గట్టుసింగారం గ్రామానికి గత మూడేళ్ల కిందటా ఆనాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయించుండ్రూ. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిండ్రూ. అప్పుడు షూరు అయిన పనులు గిప్పుడు పూర్తైయినయ్.. అక్కడక్కడ పనులు పెండింగ్ లోనే ఉన్నయ్ అనుకొండి. ఇండ్లు మాత్రం పూర్తైయినయ్..

ఇక సీసీ రోడ్లు, తాగునీటి పైపులైన్లకు కనెక్షన్లు ఇచ్చుడు, కరెంట్ కనెక్షన్లు ఇచ్చుడు మాత్రమే మిగిలింది. ఇండ్లు పూర్తైయినగదా అని గతేడాది కూసుమంచి తహసీల్దార్ శిరిషా ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ గ్రామంలో ఇంటింట సర్వే చేసిండ్రూ.. ఎవలేవ్వలు సర్కార్ ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్హులని సర్వే చేసిండ్రూ.. మొత్తానికి 20 పేర్లను గ్రామసభలో చదివిండ్రూ. ఇక అంతే మస్తు లొల్లి అయ్యింది.. అక్కడ నుంచి రెవెన్యోళ్లు వెళ్లిపోయిండ్రూ. ఆ తరువాత తహసీల్దార్ గ్రామస్థులు, సర్పంచ్ లతో మాట్లాడి మరో లిస్ట్ తయారు చేసి ప్రకటించిండ్రు. అప్పుడు మళ్లి లొల్లి కావడంతో ఆ ఇండ్లను లబ్ధిదారులకు ఇచ్చుడు పోగ్రామ్ అపేసిండ్రు. ఆ తరువాత వాటిగురించి పట్టించుకోవడమే మర్చిపోయిండ్రూ. ఇక ఆ ఇండ్లలో తలుపులు ఇరిగిపోవుడు, వర్షానికి తడిసిపోవడు, పగిలిపోవడు, కిటికిలు విరిగిపోవుడు జరుగుతాంది. చాలా మంది పేకాటాడేందు,మందు తాగేందుకు, ఇతర తప్పుడు పనులు చేసేందుకు ఆ ఇండ్లను మస్తుగా ఉపయోగించుకున్నరు.గిదే విషయాన్ని విజయం పత్రిక గతంలో కథనం రాసింది. అసాంఘీక కార్యాకలాపాలకు వేదికైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని వార్త రాస్తే అధికారులు చూసిండ్రూ వదిలేసిండ్రూ.. గ్రామస్తులు కూడా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని అనేక మార్లు అడిగిండ్రు.. ఇస్తంఇస్తమని ఎమ్మెల్యే అందరికి చెప్పిండు.. కానీ పట్టించుకోలే.. కానీ..?  allsoread-  పాలేరు ఎమ్మెల్యే కందాల ఔదార్యం

** మిట్టరాత్రి గూటిలోకి

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి ఏడాదిన్నర అవుతున్నప్పటికి ఆ లబ్దిదారులకు ఇండ్లు ఇవ్వకపోవడంతో శనివారం మిట్టరాత్రిన 20కుటుంబాలు గ్రుహప్రవేశాలు చేసిండ్రూ. రాత్రికి రాత్రే ఇండ్లలోకి వచ్చిన లబ్దిదారులు అన్ని శుభ్రం చేసుకున్నరు. చెత్తచేదారం లేకుండా పరిశరాలను పరిశుభ్రం చేసుకున్నరు. రాత్రంతా అక్కడే పడుకున్నరు. ఇక పోవుడే లేదంటున్నరు. అయితే గీ విషయం తెలుసుకున్న రెవెన్యూ ఆపీసర్లు, సర్పంచ్, గ్రామస్థులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లదాంక అచ్చి గివి అప్పుడే మీకు ఇయ్యలేదు. కొద్ది రోజులు ఆగుర్రీ. ఇంకా చానా పని ఉన్నది. ఆ పనైన తరువాత ఎంపిక చేసినోళ్లకు ఇండ్లిస్తమని చెప్పిర్రూ. లేదులేదు మేము అచ్చినం, ఇగ పోవుడే లేదు అంటూ లబ్ధిదారులు ఆపీసర్లు చెప్పేసిర్రూ. పోకపోతే కేసులు పెడతమని రెవెన్యూ ఇన్స్పెక్టర్లు హెచ్చరించిన ఫలితం లేకపోయింది. ఇక పోవుడే లేదు..మమ్మల్ని ఏమైన చేసుకోర్రీ అంటూ మొండికేసిర్రూ. దీంతో చేసేది లేక అధికారులు కొన్ని ఇండ్లకు తాళ్లలు వేసిండ్రని రెవెన్యూ అధికారులు చెప్పారు.   allso read-  నా స్పీడు తగ్గదు.. అభివృద్ది ఆగదు.. మంత్రి పువ్వాడ.

** ఇండ్లు పూర్తైయిన తరువాత అనుమతులిస్తాం : తహసీల్దార్   

గట్టుసింగారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో లిస్ట్ ఫైనల్ అయ్యింది..కానీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో పనులు పూర్తి కాలేదు. తలుపులు పగిలిపోవడం, సీసీ రోడ్లు కాలేదు, పైప్ లైన్, ఇలాంటి మైనర్ పనులు పూర్తి కాలేదు. ఒక నెలలో ఆ పనులు పూర్తి చేసిన తరువాత అధికారికంగా లిస్ట్ ను పైనల్ చేసి అందరికి గ్రుహ ప్రవేశం కోసం అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు ఎవరు ఆ ఇండ్లలోకి వెళ్లేది లేదు.

** పూరిగుడేసలో ఉండేలేకపోయినం : పావురాల స్వప్నా, లబ్దిదారురాలు.

మేము చాలా పేదళ్లం సారూ. మాకేమి లేదు. పూరిగుడిసేలో బతికినం.. కేసీఆర్ సార్ మాకు ఇల్లు ఇస్తరని మా ఊళ్లో చెప్పిండ్రూ. మస్తు సంతోషమనిపించింది. పోయినేడాది ఇండ్ల కోసం గ్రామసభల పేర్లు చదవిర్రూ మా పేరు వచ్చింది. ఏడాది గడిచిన గానీ ఇళ్లు ఇస్తలేదు. అందుకే మిట్టరాత్రి వచ్చినం సారూ..? అచ్చిన కాడనుంచి బెదిరిస్తున్నరు.

 

** చానా సంతోషంగా ఉంది : బత్తుల మరియా, లబ్దిదారురాలు

నేను, నా భర్త సుతారపనికి పోతం. రోజు పనికిపోతేనే పొట్ట గడుచుద్ది. మేము పూరి గుడిసేలో ఉంటున్నం. అనాకాలమోస్తే మస్తు ఇబ్బందు పడేటోళ్లం. మాకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అచ్చిందని తెల్వంగనే మస్తు కుషి అయినం. గేడాదైనా ఇళ్లు ఇయడం లేదు. అందుకే అచ్చినం. మాకు చానా సంతోషంగా ఉంది. ఇల్లు ఇచ్చిన కేసీఆర్ సార్ కు, ఆపీసర్లకు దండం పెడుతున్నం.

 

** అందరం అనుకొనే అచ్చినం : బొజ్జ నిర్మల

ఏడాది కిందట ఇళ్లోచ్చిందని గవర్నమెంటోళ్లు చెప్పినరు..

అప్పటి నుంచి పూరిగుడిసేను బాగుచేసుకోట్లే. ఏడాదైన ఇళ్లు ఇయడం లేదు. వచ్చేది అనా కాలం.. వానోస్తే మాకు మస్తు ఇబ్బదైతది. అందుకే ఎండకాలమే ఇండ్లకు పోవాలని అందరం అనుకుని రాత్రి  అచ్చినం.

 

** నా కొడుకు చచ్చిపోయిండు, నేను ఒక్కదాన్నే ఉంటున్న : ముప్పడి రోశమ్మ, లబ్ధిదారురాలు

నా కొడుకును ఎవలో చంపిండ్రూ. నా ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిన. ఇప్పుడు నాతాన ఒక్క పైసా కూడా లేదు.

బతికేందుకు మస్తు బాదైతాంది. ఇళ్లు లేదు,పొల్లు లేదు. ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ నాకు ఇచ్చిండంటా.. అందరం పోదామంటే నేను అన్ని చదురుకొని వచ్చిన. నాకు చానా సంతోషంగా ఉంది. నేను డాబాల బతుకతననుకోలే.