కూసుమంచి హైస్కూల్ హెచ్ఎం కు ఉత్తమ ప్రదానోపాధ్యాయుడు అవార్డు
== అభినందనలు తెలిపిన మండల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు
(కూసుమంచి-విజయంన్యూస్)
కూసుమంచి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రేల విక్రమ్ రెడ్డికి ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు అవార్డు లభించింది. విద్యా శాఖ అధికారులు సోమవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితాను ప్రకటించారు. కార్పొరేట్ కు దీటుగా కొనసాగుతున్న కూసుమంచి ఉన్నత పాఠశాలకు అవార్డు లభించింది. పాఠశాలలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు, వసతుల వినియోగంలో ముందంజలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఉపాధ్యాయులే తిరిగి బడిలో చేర్పిస్తుంటే.. ఇక్కడ మాత్రం అన్ని క్లాసుల్లో పరిమితికి మించి సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది 450 కొత్త అడ్మిషన్లు జరిగాయి. డిజిటల్ బోధన కార్పొరేట్ పాఠశాలలకే పరిమితం అయితే వాటిలో చదవాలంటే సంవత్సరానికి లక్షల రూపాయలు చెల్లించాల్సిందే..
allso read- పాలేరు కు మరో రైల్వేలైన్
కానీ కూసుమంచి ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం అందించిన ఐఎఫ్ పీ ద్వారా బోధన సాగిస్తున్నారు. నిత్యం నూతన ఒరవడిని ప్రవేశపెట్టే ప్రధా నోపాధ్యాయుడు, అధునాతన పద్ధతుల్లో బోధించే ఉపాధ్యాయులు ఇలా అందరి అంకితభావంతో పాఠశాల నడుస్తోంది. లైవ్ ఇంటరాక్షన్, జూమ్‌లో బోధన, అన్ని సబ్జెక్టుల సిలబస్ డౌన్‌లోడ్, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, నోట్స్, సైన్స్ లేబొరేటరీ వినియోగం, సైన్స్ వీడియోల పరిశీలన, సోషల్ మ్యాప్స్–ముఖ్య పట్టణాల గుర్తింపు, క్విజ్ పోటీల నిర్వహణ, సోషల్ పజిల్స్ ఇలా ఎన్నో కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది పాఠశాల విద్యార్థులు ట్రిపుల్ ఐటీ, సీవోయి కాలేజీలకు ఎంపికవుతున్నారు. గత ఏడాది పదో తరగతి విద్యార్థులు పది జీపీఏలు ఇద్దరు సాధించారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటారు. ప్రజాప్రతినిధులు, ఎస్ఎఎంసీ సభ్యులు, విద్యార్థుల భాగస్వామ్యంతో పాఠశాల కొనసాగుతోంది. ఈ సందర్భంగా హెచ్ఎం రేలా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ సమష్టి కృషితోనే అవార్డు లభించిందన్నారు. అవార్డు రావడం పట్ల ఎస్ఎంసీ చైర్ పర్సన్ ఎస్కే మైమునా, మండల విద్యాశాఖ అధికారి బివి రామాచారి , సర్పంచ్ చెన్నా మోహన్, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ హర్షం వ్యక్తం చేశారు.
allso read- తుమ్మలపై మంత్రి సెటైర్.. ఏమన్నారంటే..?