Telugu News

కూసుమంచి వ్యవసాయశాఖలో కరోనా కలకలం

నలుగురు ఏఈవోలకు కరోనా పాజిటీవ్

0

కూసుమంచి వ్యవసాయశాఖలో కరోనా కలకలం
నలుగురు ఏఈవోలకు కరోనా పాజిటీవ్
రైతు బంధు సంబరాలే కారణం
(కూసుమంచి-విజయంన్యూస్)
కరోనా రోజురోజుకు విజంభిస్తోంది.. పట్టణాలకే కాకుండా పల్లెల్లోకి చొచ్చుక వస్తోంది.. ఇటీవలే రైతు బంధు సంబురాల్లో పాల్గొని విజయవంతంగా సంబరాలను నిర్వహించిన కూసుమంచి వ్యవసాయశాఖలో కరోనా కలకలం రేపింది. కూసుమంచి మండలానికి చెందిన నలుగురు ఏఈవోలకు కరోనా పాజిటీవ్ గా తెలింది. దీంతో వారందరు హోంహైసోలేషన్ లో ఉంటూ చికిత్సపొందుతున్నారు. దీంతో మిగిలిన అధికారులు కూడా వైద్యపరీక్షలు చేయించుకునే పనిలో నిమగ్నమైయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కూసుమంచి మండలంలోని వ్యవసాయశాఖ కార్యాలయం పరిధిలో ఏడుగురు ఏఈవోలు పనిచేస్తున్నారు. వారందరు కూసుమంచి ఏడీఏ విజయ్ చంద్ర, కూసుమంచి మండల వ్యవసాయాధికారిణి ఆర్ .వాణి పరిధిలో పనిచేస్తారు. అయితే గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం గ్రామగ్రామనా రైతు బంధు సంబరాలను నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కూసుమంచి వ్యవసాయశాఖాధికారులు రైతుబంధు సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి రైతువేధిక పరిధిలో సంబురాలను ముమ్మరంగా నిర్వహించారు.

also read :-ప్రజలందరు స్వీయ రక్షణ పాటించాలి

సమావేశాలు, సభలు, ట్రాక్టర్ల ర్యాలీ, ఎడ్లబండ్ల ర్యాలీలను నిర్వహించారు. కాగా గత ఐదు రోజులుగా వారు జ్వరం, జలుబు బారీన పడ్డారు. దీంతో వైద్యుల సలహా మేరకు కోవిడ్ పరీక్షలు చేయించుకోగా 7గురిలో నలుగురు ఏఈవోలకు కరోనా పాజిటీవ్ అని నిర్థారణ అయ్యింది. దీంతో ఒక్కసారిగా వ్యవసాయశాఖాధికారులు, మిగిలిన సిబ్బంది అందరు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కొంత మందికి కరోనానెగిటివ్ వచ్చినప్పటికి వారు కూడా ఇంటికే పరిమితమైయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న కూసుమంచి మండల ప్రజలు, రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

also read ;-ఖాకీలపై డేగ కన్ను
%% వారం రోజుల పాటు సంబురాలు
రైతుబంధు సంబరాల కార్యక్రమాలను కూసుమంచి ఏఈవోల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుమారు వారం రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి రైతులందర్ని ఒకవద్దకు పిలిపించి సమావేశాలు నిర్వహించారు. సభలు, ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో ఏఈవోలకు ఎక్కడ నుంచో కరోనా సోకినట్లు కనిపిస్తుంది. అయితే వారందరు రైతులతోనే వారం రోజుల పాటు ఉండటంతో గ్రామాల్లో కూడా కరోనా వైరస్ పాకినట్లుగా కనిపిస్తోంది. గ్రామాల్లోకి కరోనా చేరడంతోనే ఏఈవోలు కరోనా భారీన పడినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే గ్రామాల్లోకి చొచ్చకపోయి ఉంటుంది. కాబట్టి ప్రజలందరు జాగ్రత్తలు పాటించాలని, మాస్క్ ధరించాలని, బౌతిక ధూరం పాటించాలని కోరుతున్నారు.