Telugu News

జీళ్ళచెర్వులో దేవి నిమజ్ఙనంలో  హత్యయత్నం

కత్తితో పొడిచిన యువకులు

0

జీళ్ళచెర్వులో దేవి నిమజ్ఙనంలో  హత్యయత్నం

== వీరబాబు అనే యువకుడిపై హత్యాయత్నం

== కత్తితో పొడిచిన యువకులు

== ఖమ్మం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స

== కేసు నమోదు చేసిన పోలీసులు

కూసుమంచి, అక్టోబర్ 7(విజయంన్యూస్)

దేవి నవరాత్రుల పాటు సంతోషంగా భక్తిభావంతో పూజలు చేసిన యువకులు చివరి నిమిషంలో నిమజ్జన సమయంలో వాగ్వాదానికి దిగారు. అది కాస్త ఘర్షణకు దారితీయడంతో వీరబాబు అనే యువకుడిపై కొంత మంది యువకులు కత్తితో దాడి చేశారు. కత్తి పొట్టలో దిగడంతో స్థానికులు హాటాహుటిన ఖమ్మం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో సమాచారం అందుకున్న కూసుమంచి పోలీసులు నింధితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.ఈ సంఘటన జీళ్ళచెరువులో చోటు చేసుకుంది.

allso read- మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు గ్రామంలో  ప్రతి ఏడాది కనకదుర్గ విగ్రహాలను ప్రతిష్టించి దేవినవరాత్రుల ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. గత 10ఏళ్లుగా అందరు ఐక్యంగా ఉంటూ ఈ సంబరాలను జరుపుకుంటారు. ఎంతో సందడిగా ఈ ఉత్సవాలను చేయడం అచారంగా వస్తుంది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది గ్రామంలో మూడు కనకదుర్గమ్మ విగ్రహాలను ప్రతిష్టించారు. నవరాత్రుల పాటు అద్భుతంగా పూజలు చేశారు. రోజంతా కోలాట, చప్పట్లతో సందడి చేశారు. ఆనందోత్సవాల నడుమ, భక్తిశ్రద్దలతో పూజలు చేశారు. అయితే చివరి రోజు గురువారం నిమజ్జనం చేసే కార్యక్రమం జరుగుతుండగా కొంత మంది యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. పరస్సర ఘర్షణ పడుతున్న సమయంలో ఐతగాని వీరబాబు(20) అనే యువకుడిపై కత్తితో కడుపులో పోడిచి హత్యయత్నానికి ప్రయత్నించారు. దీంతో స్థానికులు గమనించి తక్షణమే కిమ్స్ కు తరలించారు. అక్కడ వైద్యులు వీరబాబుకు ఆపరేషన్ చేసి వైద్యసేవలను అందిస్తున్నారు. ఈ సమయంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా సమాచారం అందుకున్న కూసుమంచి ఎస్ఐ నందీఫ్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి వచ్చి విగ్రహాలను నిమజ్జనం చేయించారు. ఎలాంటి గొడవ వాతావరణం లేకుండా చేశారు. అనంతరం కూసుమంచి సీఐ కె.సతీష్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం బాధితుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా పోలీసులు గస్తికాచారు. పలువురికి అవగాహణ కల్పిస్తున్నట్లు తెలిసింది.

ALLSO READ- మునుగోడు ఎన్నికపై నామా సంచలన ప్రకటన