Telugu News

జీళ్ళచెరువులో ఘనంగా ఉట్లపండుగ

దేవాలయం సమీపంలో ఉట్లు కొట్టిన యాదవులు

0

జీళ్ళచెరువులో ఘనంగా ఉట్లపండుగ

== దేవాలయం సమీపంలో ఉట్లు కొట్టిన యాదవులు

(కూసుమంచి-విజయంన్యూస్)

కూసుమంచి మండలంలో జీళ్ళచెరువు గ్రామంలో శ్రీసీతారామచంద్రస్వామి, శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో  శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ బొడ్డు నరేందర్, చెన్నా వెంకన్న ఆధ్వర్యంలో ఉట్ల పండుగ ఘనంగా నిర్వహించారు. యాదవులు కర్రలతో ఉట్లను కొడుతుంటే భక్తులు వారిపై నీళ్లు చల్లడం, పగిలిన ఉట్టి కోసం భక్తులు ఎగబడటం హిందుసంప్రధాయానికి అద్దంపట్టింది. అది భక్తులను ఆనందింపజేసింది.  ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో నారాయణ చార్యులు, అర్చకులు అప్పలచార్యులు,  సర్పంచ్ కొండ సత్యం, ఎంపీటీసీ అంబాల ఉమాశ్రీనివాస్, గ్రామ ప్రజలు హాజరైయ్యారు.

ALLSO READ- గ్లోబల్ రెయిన్ బో స్కూల్ లో ఘనంగా కృష్ణా ష్టమి వేడుకలు