Telugu News

జుజ్జులరావుపేటలో రైతుల పేరుతో ‘రియల్ మోసం’

అనుమతులు లేకుండానే వ్యాపారం షూరు

0

జజ్జులరావుపేటలో రైతుల పేరుతో ‘రియల్ మోసం’

== అనుమతులు లేకుండానే వ్యాపారం షూరు

== ప్లాట్లుగా మారుతున్నపచ్చని పంట భూములు

== కన్వర్షన్ అనుమతులు లేకుండానే యదేచ్ఛగా భూ మార్పిడి

== పనులు జరుగుతున్న పట్టించుకుని రెవెన్యూ అధికారులు

== అడిగితే అధికారమంటూ హుకాయింపు.??

== వారికి అండగా ఓ విలేకరి..

== అంతా మనవాళ్లే అంటూ ఓ విలేకరి చెప్పుకొచ్చే ప్రయత్నం

== వెంచర్ నిర్మాణ పనులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మండల పరిషత్ అధికారులు

== అనుమతులు లేవంటూ బోర్డుల ఏర్పాటు

కూసుమంచి, నవంబర్ 3(విజయంన్యూస్)

వ్యవసాయ భూములను మార్పడి చేయాలంటే, ఆ భూమిని ఇండ్ల నిర్మాణం కోసం ప్లాట్లుగా మార్చాలంటే కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.. ముందుగా రైతుల నుంచి పూర్తి స్థాయి అనుమతులు, పక్కా వ్యాపారి లేదా సంస్థపేరుతో రిజిస్ట్రేషన్,  నాలా అనుమతి, ఆ తరువాత పంచాయతీ తీర్మాణం, డీటీపీసీ అనుమతి సుడా పరిధిలో అయితే టౌన్ ప్లానింగ్ అనుమతి తప్పని సరి అవసరం. ముఖ్యంగా నాలా అనుమతుల కోసం రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖలతో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.. ఇవ్వన్ని పక్కా వచ్చిన తరువాత రియల్ వ్యాపారానికి సంబంధించిన ప్రచారం, బ్రోచర్ల ఏర్పాటు, లేఆవుట్ నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది..

ఇది కూడా చదవండి : జుజ్జులరావుపేటలో రియల్ దందా..?

ఇందులో ఏ ఒక్క అనుమతి లేకపోయినప్పటికి  వెంచర్ నిర్మాణం చేసే అవకాశం ఉండదు. మరి ముఖ్యంగా వ్యాపారులు లేదా సంస్థలు రియల్ వ్యాపారం అంటే వెంచర్ నిర్మాణం చేసే ముందు కచ్చింతంగా రైతుల నుంచి పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.. పైనా చెప్పిన ఏ ఒక్క అనుమతి లేకుండా కూసుమంచి మండలంలో 100 ఎకరాల్లో వెంచర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. ఇదేందని అధికారులు అడిగితే వెంచర్ కాదు, రైతులు భూమిని సదును చేస్తున్నారని చెబుతున్నప్పటికి అప్పటికే అక్కడ వెంచర్ నిర్మాణం చేస్తున్నట్లు ఓ రియల్ ఎస్టెట్ వ్యాపార సంస్థ అద్భుతమైన ప్రచారం చేసుకుంది. కరపత్రాలు, మల్టికలర్ లో బ్రోచర్, యూట్యూబ్ లో ప్రచారం చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన మండల పరిషత్ అధికారులు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టే పనిలో నిమ్నమైయ్యారు. ఈ క్రమంలో పాలేరు నియోజకవర్గంలో పనిచేస్తున్న ఓ విలేకరి రంగప్రవేశం చేసి వాళ్లంతా మావాళ్లే, పనులు చేసిపెట్టండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే

ఇది కూడా చదవండి: హైదరాబాద్ రోడ్లపై త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు

ఖమ్మం- సూర్యపేట వరకు జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. దాదాపుగా నిర్మాణ పనులు పూర్తై వాహనాల రాకపోకలు ప్రారంభమైయ్యాయి.. దీంతో రియల్ వ్యాపారులు పలు ప్రాంతాల్లో వెంచర్లను నిర్మాణం చేస్తున్నారు. అందులో భాగంగానే కూసుమంచి మండలంలోని  జుజ్జులరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి అనుకుని ఓ వ్యాపార సంస్థ 7 గురు రైతుల వద్ద నుంచి 39.12 ఎకరాలను కొనుగోలు చేసింది. మరో కొంత మంది రైతుల వద్ద నుంచి 3 ఎకరాలను కొనుగోలు చేసి మొత్తం 42 ఎకరాల వరకు కొనుగోలు చేసి, ఆ రైతులందరికి ¼ చొప్పున డబ్బులను ఇచ్చి అగ్రమెంట్ చేయించుకున్నారు. ఆ తరువాత వెంచర్ నిర్మాణం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. జాతీయ రహదారి మొత్తం ప్రచార బోర్డులను ఏర్పాటు చేశారు. మల్టికలర్ లో బ్రోచర్లను తీశారు. అని అనుమతులు ఉన్నాయంటూ డీటీపీసీ, కన్వర్షన్, పంచాయతీ అనుమతులు ఉన్నాయంటూ ప్రచారం చేశారు. దీంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఆ వ్యాపార సంస్థ పంట పోలాలను భూ మార్పిడి చేసే పనిలో నిమగ్నమైయ్యారు. జేసీబీలు, డోజర్లు, టిప్పర్లతో అభివద్ది పనులు జరుగుతున్నాయి. దీంతో మండల పరిషత్ అధికారులు స్పందించి ఆ పనులను ఆపేందుకు ప్రయత్నం చేశారు. అనుమతులు లేకపోవడం, పంచాయతీకి కనీసం వినతి రాకపోవడంతో స్పందించిన పంచాయతీ కార్యదర్శి సహాజ మండల పరిషత్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఎంపీవో రామచంద్రయ్య తక్షణమే ప్రచారానికి సంబంధించిన బోర్డులను తొలగించారు. వాటిని స్వాధినం చేసుకుని పంచాయతీ కార్యాలయానికి తరలించారు. ఆ తరువాత ప్లెక్సిలను ఏర్పాటు చేశారు. కొద్ది రోజులకే ప్లెక్సిలు మాయం కాగా, తిరిగి జేసీబీలతో పనులు ప్రారంభమైయ్యాయి. దీంతో మరోసారి ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఎంపీవో రామచంద్రయ్య స్పందించి జుజ్జులరావుపేట గ్రామంలో పర్యటించి దర్యాప్తు చేశారు. కాగా భూమిని అమ్మిన రైతులతో అధికారులు మాట్లాడగా ఓ రియల్ వ్యాపార సంస్థ యజమానికి భూమి విక్రయించింది నిజమేనని, ¼ వరకు మాకు డబ్బులు చెల్లించారని, రిజిస్ట్రేషన్ కాలేదని, ఆ భూమి మాపేరుతో ఉన్నట్లుగా రైతులు అధికారులకు తెలిపారు. మరీ అభివద్ది పనులు జరుగుతున్నాయి కదా అని అధికారులు అడిగిన ప్రశ్నకు మేమే రైతులం చేసుకుంటున్నామని తెలిపారు. భూమి విక్రయించిన తరువాత మీరేలా పనులు చేస్తారని, మీ భూమిలో వెంచర్ వేస్తున్నట్లు సర్వే నెంబర్లతో సహా, ప్లాట్ నంబర్లతో సహా బ్రోచర్లను విడుదల చేశారని, ప్రచారం చేసుకుంటున్నారు కదా..

ఇది కూడాచదండి: బంగ్లాపై భారత్ ఘనవిజయం

ఎందుకు అడ్డుకోలేదని అధికారులు ప్రశ్నించగా, రైతులు మౌనం పాటించినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీడీవో, ఎంపీవో పంచాయతీ కార్యదర్శి, రైతులు అందించిన సమాచారం మేరకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదికను అందించారు. దీంతో పాటు మీడియాలో వరస కథనాలు వస్తుండటంతో రంగంలోకి దిగిన మండల పరిషత్ అధికారులు అక్కడ అనుమతులు లేవని, ప్రజలు ఎవరు కొనుగోలు చేయోద్దనే బోర్డులను వెంచర్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ విషయంపై కూసుమంచి మండల పరిషత్ అధ్యక్షులు బానోతు శ్రీనివాస్ నాయక్ సిరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతులు లేని వెంచర్లపై కచ్ఛితంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. అయితే అనుమతులు లేకపోవడంతో నూతన పంచాయతీ రాజ్ చట్టం నీరుగారుతున్నట్లే కనిపిస్తుంది. అంతే కాకుండా పంచాయతీకి రావాల్సిన ఆదాయానికి కూడా గండిపడుతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

== పచ్చని భూముల్లో వెంచర్లు

ఎన్ఎస్పీ కాలువ కిందా ప్రతి ఏడాది రెండు పంటలను సాగు చేసే పచ్చని మాగాణి భూములు రియల్ మాయలో పడి బంధీలవుతున్నాయి.. పచ్చని పంట భూములు ప్లాట్లుగా మారిపోతున్నాయి.. ఎలాంటి అనుమతులు లేకుండానే పచ్చని భూములను రియల్ వ్యాపారం కోసం భూ మార్పిడి చేస్తున్నారు. రైతుల పేరుతో పంట భూములను అనుమతులు లేకుండా అభివద్ది పనులు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే రైతులు మాగాణి భూములను మెట్టభూములుగా మార్పిడి చేసుకుంటున్నారని చెబుతున్నప్పటికి  జరుగుతున్న పనులు, ముమ్మరంగా చేసే ప్రచారం అక్కడ ఎవరు పనులు చేస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది.

== ఆయన పాత్ర ఏంటి..?

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పంట భూములను భూ మార్పిడి చేసుకుని, వెంచర్లు వేసుకునే వెసులుబాటు ఉంటుంది.. అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఓ వ్యాపార సంస్థ సుమారు 100 ఎకరాల్లో రియల్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తుండగా, బాధ్యతగల్గిన జర్నలిస్ట్ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని చెప్పాల్సింది పోయి, వాళ్లందరు మావాళ్లే, అందరికి అందాల్సినవి అందుతున్నాయి, మీరు కూడా సపోర్టు చేయండని మండల, గ్రామస్థాయి అధికారులకు చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతున్నట్లు తెలుస్తోంది.. సంబంధించిన వారు కూడా ఆ విలేకరి అన్ని చూసుకుంటాడని తోటి విలేకర్లకు చెబుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అది ఎంత వరకు నిజమే తెలియదు కానీ.. ఓ జర్నలిస్ట్ గా కచ్చితంగా నిబంధనలు పాటించేలా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంటుంది.

== అనుమతులు తీసుకోకపోతే చర్యలు తప్పవు: కరుణాకర్ రెడ్డి, ఎంపీడీవో, కూసుమంచి.

కూసుమంచి మండలంలోని జుజ్జులరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా వెంచర్ నిర్మాణం జరుగుతున్నట్లు మాకు తెలిసింది. ప్రభుత్వ పంచాయతీ రాజ్ నిబంధనల ప్రకారం కచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా కన్వర్షన్, లేఆవుట్ అనుమతి, టౌన్ ప్లానింగ్ అనుమతులు తప్పకుండా ఉండాలి. ఏ ఒక్క అనుమతి లేకుండా వెంచర్ నిర్మాణ  పనులు జరుగుతున్నాయి. అలాగే పెద్ద ఎత్తున ఓ వ్యాపార సంస్థ 10ర0 ఎకరాల్లో వెంచర్ వేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ, జాతీయ రహదారి వారిగా బోర్డులను ఏర్పాటు చేశారు. కరపత్రాలు, బ్రోచర్లను తీశారు. ఈ విషయంపై నేనే, ఎంపీవో రామచంద్రయ్య స్వయంగా విచారణ చేశాము. 7మంది రైతుల వద్ద నుంచి 39.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ¼ చెల్లించినట్లు రైతులు చెప్పారు. అందుకు గాను అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వెంచర్లను నిర్మాణం చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ వెంచర్ నిర్మాణ పనుల వద్ద బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. పై అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాము.