కూసుమంచిలో పలు రాకపోకలు బంద్
== రాహదారిపై ఉధృక్తంగా ప్రవహిస్తున్న వరద నీరు
== రాకపోకలను నిలిపివేసిన అధికారులు
కూసుమంచి, జులై 23(విజయంన్యూస్)
కూసుమంచి మండలంలో శుక్రవారం రోజంతా కురిసిన వర్షానికి భారీగా వరదలు వస్తున్నాయి. ఎగువ జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా భారీ వరదలతో చెరువులు అలుగు పారుతున్నాయి. సూర్యపేట, మహుబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవగా వచ్చిన వరదలకు ఆ ప్రాంతాల్లో చెరువులు అలుగులు పారుతున్నాయి. దీంతో కూసుమంచి మండలం పాలేరు జలాశయంకు భారీగా వరద వస్తోంది. దీంతో కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న వంతెనలపై వరద నీరు ప్రవహిస్తున్నాయి. కాగాఆయా రహధారులపై రాకపోకలు నిలిచిపోయాయి. కూసుమంచి మండలంలోని నర్సింహులగూడెం నుంచి కిష్టాపురం గ్రామానికి వెళ్లే చెప్టా పొంగిపోర్లుతుంది. అలాగే నర్సింహులగూడెం టూ తుమ్మగూడెం వయా కొత్తూరు వెళ్లే రహదారి పై వరద ఉగ్రరూపంలో ప్రవహిస్తుండగా ఆ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇక పాలేరు అలుగు ఉధృత్తంగా ప్రవహిస్తుండగా కూసుమంచి మండలంలోని పెరికసింగారం, రాజుపేట గ్రామాల మధ్య ఉన్న వంతెన పై 5అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో అక్కడ రాకపోకలను నిలిపివేశారు. అలాగే నాయకన్ గూడెం- కోదాడ రహదారి ఈశ్వరమాదారం రహదారిపై వరద భారీగా ప్రవహిస్తుండటంతో ఆ రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి. ఇలా పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిన పరిస్థితి ఉంది. పోలీసులు అందకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు.
ALLSO READ- పొంగిపోర్లుతున్న పాలేరు జలాశయం