Telugu News

ప్రజల మన్నన్నలను పొందిన తహసీల్దార్ శిరీషా

భూ సమస్యలను పరిష్కరించడంలో సక్సెస్

0

ప్రజల మన్నన్నలను పొందిన తహసీల్దార్ శిరీషా

== భూ సమస్యలను పరిష్కరించడంలో సక్సెస్

== రాజకీయాలకు, అవినీతికి దూరంగా పాలన

కూసుమంచి, జూన్ 18(విజయంన్యూస్)

గతమూడుసంవత్సరాలుగా కూసుమంచి తహసీల్దార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నశిరీష  చాలా అద్భుతంగా పనిచేసి ప్రజల మన్నన్నలను పొందారు. రెవెన్యూ శాఖపై రోజుకో అక్రమాలకు సంబంధించిన ఆందోళనలు జరుగుతున్న తరుణంలో బాధ్యతలు చేపట్టిన శిరీషా చాలా అద్భుతమైన పనితీరుతో ప్రజలను మొప్పించారు. అందరికి సమన్యాయమేనంటూ రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ బెస్ట్ తహసీల్దార్ గా గుర్తింపు పొందారు. సమస్యలను ఒక్కోక్కటిగా పరిష్కరిస్తూ కచ్చితత్వాన్ని, సిబ్బంది విచారణ, సర్వే రిపోర్ట్ ఆధారంగా భూ స మస్యలను పరిష్కరించారు. కార్యాయలయంకు వచ్చే ప్రతి బాధితులను పిలిచి వార సమస్యను అడిగి తెలుసుకుని సకాలంలోనే వారికి న్యాయం చేసే విధంగా ఆమె పనిచేశారు. సిబ్బంది పట్ల కొంత కఠినంగా ఆమె వ్యవహరించిన, ఆమె పనితీరు ప్రజల కోసంగానే ఉండేది. సమస్యల వలయంలో ఉన్న కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంను సమస్యలు లేని తహసీల్దార్ కార్యాలయంగా మార్చిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం ఉన్న తహసీల్దార్ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల అభినందనలను అందుకుంది. ముళ్లకంపకంటే ఎక్కువగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణిలో చాలా జాగ్రత్తగా, రాజకీయాలకు అతీతంగా, అవినీతికి దూరంగా ఉంటూ కచ్చితత్వంగా అర్హత కల్గిన వారికి మాత్రమే ఇండ్లను మంజూరు చేసి నిరుపేదల పట్ల ప్రజాధరణ పొందారు. కూసుమంచి తహసీల్దార్ కార్యాలయ చరిత్రలో అవినీతి మచ్చలేకుండా బదిలీపై వెళ్లిన ఏకైక తహసీల్దార్ శిరీషా అని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయమే పరమాధిగా నడుస్తున్న సందర్భంలో తహసీల్దార్ కార్యాలయానికే రాజకీయ నాయకులను దూరంగా ఉంచుతూ మూడేళ్ల పాటు అద్భుతమైన పరిపాలన చేసిన శిరీషాను కూసుమంచి మండల ప్రజలు అభినందనలు చెబుతున్నారు.

allso read- ఖమ్మంలో ఆవుల సుబ్బారావు అరెస్టు