Telugu News

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య యత్నం

ఆస్పత్రికి తరలింపు..పరిస్థితి విషమం

0
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య యత్నం
** ఆస్పత్రికి తరలింపు..పరిస్థితి విషమం
కూసుమంచి, జూన్ 232(విజయంన్యూస్)
కూసుమంచి మండల పరిధిలోని లోక్యతండాకు చెందిన వడిత్యా గోపి అప్పులబాధ తాళలేక పురుగులమందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి లోక్యతండా లో చోటుచేసుకుంది. పురుగుల మందు తాగిన గోపిని  హుటాహుటిన బందువులు ఖమంలోని ప్రైవేట్ హస్పత్రికి తరలించారు.  పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.