గోవు తోకకు శస్త్రచికిత్స
== పశు వైద్యశాలలో శస్త్ర చికిత్స చేసిన వైద్యులు
(కూసుమంచి-విజయంన్యూస్)
గోవు తోకకు శస్త్ర చికిత్స చేసిన సంఘటన బుధవారం కూసుమంచి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. శరీరానికి, అనేక ప్రాంతాల్లో శస్త్రచికిత్స చేసిన వైద్యులు, గోవు తోకకు ఆపరేషన్ చేసి ఆ తోకను తిరిగి పశువుకు ఉండే విధంగా ఏర్పాటు చేశారు పశువైద్యులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కూసుమంచి మండలంలోని లోక్యాతండా గ్రామానికి చెందిన రైతు వడ్త్యా హము తన కాడెద్దు తోక కి గాయమై తీవ్ర రక్తం స్రావం కావడంతో కూసుమంచి మండల కేంద్రంలోని పశు వైద్యశాలకు తీసుకుని రాగా పశు వైద్యాధికారి ఆర్.నీలకాంత్ తోకను పరీక్షించారు.
ఇది కూడాచదవండి : చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి
కాగా ఎద్దు తోక మొత్తం వాసి,అంతర్గత రక్తస్రావం కావడంతో పశు వైద్య సహాయకులు నరేంద్ర కుమార్ సహాయంతో తోకకి శ్రస్త చికిత్స చేసి సగ భాగాన్ని కత్తిరించి వేశారు.అనంతరం ఆయన మాట్లాడతూ తోక భాగానికి గాయమై అంతర్గతంగా రక్తస్రావం కావడంతో తోక తొలగించినట్లు తెలిపారు.రెండు రోజలకొకసారి గాయాన్ని పరిశీలించి డ్రెస్సింగ్ చేయాలని,వారంలో కుట్లు తీసివేయడం జరుగుతుందని తుదుపరి గాయం మానిపోతుందని తెలిపారు. ఈ సందర్భంగా రైతు హాము పశు వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.