Telugu News

కూసుమంచి పెట్రోల్ బంక్ లో వినియోగదారుల ఆందోళన..*

పెట్రోల్ తక్కువ వస్తుందన ఆరోపిస్తూ ఆగ్రహం

0

*కూసుమంచి పెట్రోల్ బంక్ లో వినియోగదారుల ఆందోళన..*

** పెట్రోల్ తక్కువ వస్తుందన ఆరోపిస్తూ ఆగ్రహం

** అధికారులు స్పందించాలని.. తక్షణమే సీజ్ చేయాలన డిమాండ్..

(కూసుమంచి-విజయం న్యూస్)
కూసుమంచి మండల కేంద్రంలో ఉన్న పెట్రోల్ బంక్ లో వినియోగదారులు ఆందోళన చేశారు. పెట్రోల్ తక్కువ వస్తుందని ఆందోళన చేశారు. మల్లెపల్లి గ్రామానికి చెందిన కట్టా సుధాకర్ ఆదివారం కూసుమంచి పెట్రోల్ బంక్ లోరూ.500పెట్రోల్ కొట్టించగా కేవలం 2లీటర్ల మాత్రమేవచ్చింది. అలాగే లోక్యతండా కు చెందిన ఓ రైతు రూ.200పెట్రోల్ కొట్టించగా అరలీటర్ తక్కువ వచ్చింది. దీంతో వినియోగదారులుగొడవ చేశారు. ఎందుకు ఇలా వస్తుందని పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న వారిని ప్రశ్నించగా దురుసుగా మాట్లాడటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున గొడవ కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. కచ్చితంగా చర్యలూ తీసుకుంటామని హామినిచ్చారు. అయితే ఇటీవలే పెట్రోల్ తక్కువ వస్తుందని వినియోగదారులు ఫిర్యాదు చేయగా తనిఖీ చేసిన అధికారులు పెట్రోల్ బంక్ ను తక్కువ వస్తుందని సీజ్ చేశారు. కాగా గత కొద్ది రోజుల క్రితం ఓపెన్ చేయగా , తిరిగి అదే పరిస్థితి ఏర్పడింది.

Also read:-  ఎస్ఐ ని కాల్చిన హెడ్ కానిస్టేబుల్..