Telugu News

నాయకన్ గూడెంలో 8 గొర్రెలు మృతి

అందువల్లనేనా..?

0

నాయకన్ గూడెంలో కుక్కల దాడిలో 8 గొర్రెలు మృతి

== రూ.లక్ష వరకు నష్టపోయిన రైతు

==  పరామర్శించిన గొర్రెల,మేకల పెంపకదారుల సంఘం

(కూసుమంచి-విజయంన్యూస్)

కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో విషాద సంఘటన జరిగింది. పెంపకు గొర్రెల పై కుక్కలు దాడి చేయడంతో 8 గొర్రెలు అక్కడిక్కడే మృతి చెందాయి. మరో కొన్ని గొర్రెలు గాయపడినట్లు గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల్లోకి  కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం గ్రామానికి చెందిన బొల్లం నర్సయ్య ప్రతి రోజు గొర్రెలు కాచుకుంటూ జీవనం గడుపుతున్నారు.

allso read-  బిలీఫ్ ఆసుపత్రి పై ఐటీ దాడులేందుకు..?

ప్రతి రోజులాగే మంగళవారం అడవికి పోయి తిరిగి ఇంటికి వచ్చిన గొర్రెలు తన ఇంటి సమీపంలో నిద్రిస్తుండగా, తెల్లవారే సరికి 8గొర్రెలు మృతి చెంది ఉన్నాయి. నిద్రలేచి చూసిన బొల్లం నర్సయ్యకు గుండె పగిలే అంత పనైంది. ఎందుకు చనిపోయాయని ఆరా తీయగా రాత్రి సమయంలో కొన్ని కుక్కలు దాడి చేసినట్లుగా గుర్తించారు.దీంతో బొల్లం నర్సయ్య కష్టపడి చాదుకునే గొర్రెలు చనిపోవడంతో సుమారు రూ.1లక్ష వరకు నష్టపోయి ఉంటాడని ప్రజలు భావిస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని, వాటి వల్ల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కాపరి నర్సయ్య వేడుకుంటున్నాడు. ఈ సంఘటన తెలుసుకున్న అనంతరం గొర్రెల మేకల దారుల సంఘం నాయకులు నాయకన్ గూడెం వెళ్లి గొర్రెలను పరిశీలించారు. బాధిత నర్సయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.