Telugu News

కూసుమంచిలో ఫ్రీడం రన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కందాళ

హాజరైన ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, అధికారులు

0

ఫ్రీడం రన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కందాళ

== హాజరైన ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, అధికారులు

కూసుమంచి, ఆగస్టు 11(విజయంన్యూస్)

భారత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో కూసుమంచి మండల కేంద్రంలో కూసుమంచి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీడం రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హాజరైయ్యారు.

allso read- గోదావరి వరదను ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి పువ్వాడ

గంగబండతండా బైపాస్ నుంచి కూసుమంచి వరకు ఫ్రీడం రన్ ను ఏర్పాటు చేయగా, ఆ రన్ ను ఎమ్మెల్యే  కందాళ ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ రన్ లో కూసుమంచి సీఐ సతీస్, ఎస్ఐ నందీఫ్, ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్, మండల మెడికల్ ఆపీసర్ శ్రీనివాస్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై రన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగానే మన భారత దేశానికి స్వేచ్చా స్వాతంత్రం వచ్చిందన్నారు. అమరవీరుల ప్రాణత్యాగాలను నిత్యం స్మరించాలని, వారి త్యాగఫలితం దక్కే విధంగా వారిని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలను అమలు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందన్నారు. అంతకంటే ముందుగా విద్యార్థులతో 75వ స్వాతంత్ర సింబల్ ను ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ రామసహాయం బాలక్రిష్ణారెడ్డి, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సెట్రామ్ నాయక్, కూసుమంచి సర్పంచ్ చెన్నా మోహన్ రావు, డీసీసీబీ డైరెక్టర్ ఐ.శేఖర్, కూసుమంచి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష్,ప్రధాన కార్యదర్శులు వేముల వీరయ్య, ఆసీఫ్ పాషా, సోషల్ మీడియా ఇన్ చార్జ్ వడ్తియా బాలక్రిష్ణా తదితరులు హాజరైయ్యారు.