Telugu News

ప్రజలకు సేవకులుగా పనిచేయాలి : ఎమ్మెల్యే కందాళ 

పాలేరు నియోజకవర్గంలోని విీఆర్ఏలందరికి నిత్యావసర సరుకులు పంపిణి చేసిన ఎమ్మెల్యే కందాళ

0

ప్రజలకు సేవకులుగా పనిచేయాలి : ఎమ్మెల్యే కందాళ 

== ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సేవాభావంతో పనిచేయాలి

== వీఆర్ఏలకు సూచించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

== పాలేరు నియోజకవర్గంలోని విీఆర్ఏలందరికి నిత్యావసర సరుకులు పంపిణి చేసిన ఎమ్మెల్యే కందాళ

==నిత్యావసర సరకులు ఇవ్వడం ధన్యవాదాలు తెలిపిన వీఆర్ఏల సంఘం 

కూసుమంచి, అక్టోబర్ 25(విజయంన్యూస్)

వీఆర్ఏలందరు ప్రజలకు సేవకులుగా పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సేవాభావంతో పని చేయాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సూచించారు. పనిచేసే 80 రోజులుగా సమ్మె చేసిన వీఆర్ఏలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి దీపావళి పండుగ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 170 మంది వీఆర్ఏలకు నిత్యవసర సరుకులు, బియ్యం అందించారు. ఆయన స్వంత ఖర్చులతో బియ్యం, ఇంట్లోకి కావాల్సిన సరుకులను అందజేశారు. కాగా వీఆర్ఏలందరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

ALLSO READ- ఊరంతా కదిలారు.. రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు

అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ వీఆర్ఏలంటే గ్రామీణ ప్రజా సేవకులని, వారితోనే రైతుల జీవితాలు ముడిపడి ఉన్నాయన్నారు. ప్రతి భూమి, ప్రతి సమస్యను ప్రజలు, రైతులు వీఆర్ఏలకే ముందుగా చెప్పుకుంటారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో పనిచేస్తూ మంచి సలహాలను అందించాలని సూచించారు. భూముల రిజిస్ట్రేషన్ విషయాల్లో తప్పులు చేయోద్దని, అమాయక రైతులను, అన్నం పెట్టే రైతులను మోసం చేయోద్దని సూచించారు. కష్టంలో కూడా ఇష్టాన్ని వెతుక్కుని పనిచేయాలన్నారు. వీఆర్ఏల సమస్యలను కచ్చితంగా సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం వీఆర్ఏల జిల్లా అధ్యక్షుడు షేక్ అజిజ్ మాట్లాడుతూ మా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సహాయం చేస్తున్న ఎమ్మెల్యే మిగతా నాయకులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. కష్ట కాలంలో ఎమ్మెల్యే చేస్తున్న సహాయాన్ని మరువమని అన్నారు.

ALLSO READ-  ‌వైరా మండలం రెబ్బవరంలో హత్య..

జిల్లా వీఆర్ఏల కార్యదర్శి లింగరాజు గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చేస్తున్న సహాయాన్ని, ప్రభుత్వం మాకు ఇవ్వనున్న పేస్కేలను ఎప్పటికీ మరచిపోమని అన్నారు. ఈ క్రమానికి హాజరైన నియోజకవర్గ వీఆర్ఏలందరూ ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీపీ బానోతు శ్రీనివాస్ మాట్లాడుతూ   కష్టంతో క్యాంప్ కార్యాలయంలో అడుగుపెట్టడమే తరువాయి ఆ కష్టం క్యాంప్ ఆఫీస్ కాంపౌండ్ దాటనివ్వకుండా, ఆయన్ని అడిగితే లేదనకుండా  ప్రతి ఒక్కరికి సహాయం చేసే బహుగుణ సంపన్నుడు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అని కొనియాడారు.   ఒక వీఆర్ఏ ఒక అనుచరుడితో మామూలుగా అడిగిన ఒక్క మాట కోసం ఒక్క మండలానికి కాదు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల వీఆర్ఏలకు కూడా సహాయం చేద్దామనే గొప్ప మనసు ఎమ్మెల్యే కందాళదని అన్నారు.  వీఆర్ఏ లందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారాని, పేద వర్గాలకు చెందిన వారనీ కష్ట కాలంలో వారికి సహాయం అందించాలనే సదుద్దేశంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు  మహమ్మద్ అసిఫ్ పాషా,  డిసిసిబి డైరెక్టర్ శేఖర్, మళ్ళీడు వెంకన్న, రైతుబంధు మండల కోఆర్డినేటర్ బానోతు రామ్ కుమార్, నియోజకవర్గ వీఆర్ఏ నాయకులు దారా శ్రీనివాసరావు, మెంటం శ్రీను, సైదులు, చాంద్ మియా,అన్వర్,రమేష్ పాల్గొన్నారు.

ALLSO READ- పాదయాత్ర లో డప్పు దరువేసిన సీతక్క