Telugu News

మానవత్వం చాటుకున్న కూసుమంచి ఎంపీపీ

ప్రమాదంలో గాయపడిన వారిని తన కారులో ఆసుపత్రికి తరలింపు

0

మానవత్వం చాటుకున్న ఎంపీపీ

== ప్రమాదంలో గాయపడిన వారిని తన కారులో ఆసుపత్రికి తరలింపు

కూసుమంచి, ఆగస్టు 28(విజయంన్యూస్)

కూసుమంచి మండల ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్ మానవత్వం చాటుకున్నారు.  కూసుమంచి నుంచి తన స్వగ్రామమైన గోరిలపాడుతండా కారులో వెళ్తుండగా గట్టుసింగారం నుంచి పెరికిసింగారం వెళ్లే మార్గం మధ్యలో బురేన్ గుట్టతండా  వద్ద  రెండు మోటర్ సైకిళ్లు ఢికొట్టుకున్నాయి. దీంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి, ఒక మహళలకు గాయాలు కావడంతో అటుగా వెళ్తున్న కూసుమంచి మండలం ఎంపీపీ  బానోత్ శ్రీనివాస్ నాయక్, ఆగి గాయపడిన క్షతగాత్రులను తన  కారులో ఎక్కించుకొని ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ లో తీసుకెళ్లాడు. స్వయంగా ఆయన డ్రైవింగ్ చేస్తూ గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లి వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా చేశారు. ఈ విషయాన్ని పోటోలతో వాట్సఫ్ గ్రూపులలో ఎవరో పోస్టు చేయగా ఎంపీపీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

allso read- టాస్ విన్ బై ఇండియా