Telugu News

బూతు పురాణంపై ముదిగొండ పీఎస్ లో పిర్యాదు

పలువురి నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బాధితుడు సురేష్..

0

బూతు పురాణంపై ముదిగొండ పీఎస్ లో పిర్యాదు

★★ పలువురి నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బాధితుడు సురేష్..

ఖమ్మం ప్రతినిధి, ఆగస్టు 13(విజయంన్యూస్)
ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారిన అధికార పార్టీ నాయకుడి బూతు పురాణం కథ మరో మలుపు తిరిగింది. ఆర్టీఐ పెట్టిన డి. సురేష్ ముదిగొండ పోలీస్ స్టేషన్ లో శనివారం ఇద్దరిపై ఫిర్యాదు చేశారు. పిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన డి సురేష్, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, జీళ్ళచెరువు గ్రామపంచాయతీ నిధులు ఖర్చులు వివరాలపై ఆర్టీఐ చట్టం ప్రకారం పంచాయతీ కార్యదర్శికి వినతి చేశారు.

Allso read-పాలేరు ఎమ్మెల్యే అనుచరుడి బూత్ పురాణం

పంచాయతీ కార్యదర్శి అందుకు సంబంధించిన వివరాలను ఇవ్వకపోవడంపై సురేష్ పై అధికారులను సంప్రదించాడు. అయినప్పటికీ వివరాలు ఇవ్వకపోవడంతో కూసుమంచి మండల పంచాయతీ అధికారికి ఆర్టీఐ చట్టం ప్రకారం వినతి చేశారు. ఈ విషయంపై కూసుమంచి మండల టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, జడ్పిటిసి భర్త, డీసీసీబీ డైరెక్టర్ గా పని చేస్తున్న ఇంటూరి శేఖర్, అలాగే గ్రామ పంచాయతీలో కోఆప్షన్ మెంబర్ గా పనిచేస్తున్న ఐతగాని రాంగోపాల్ ఇద్దరు ఫోన్ చేసి బెదిరింపులకి పాల్పడినట్లు ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఆడియో సంచలనం రేపింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆర్టిఐ దరఖాస్తు చేసిన సురేష్ ముదిగొండ పోలీస్ స్టేషన్లో రాంగోపాల్ పై ఫిర్యాదు చేశారు. పార్టీ పార్టీ ప్రకారం దరఖాస్తు చేసుకునే హక్కు ఎవరికైనా ఉందని, చేసినందుకు ఇంటూరి శేఖర్ అయిగాని రాంగోపాల్ నన్ను బెదిరించారని వారిపై చర్యలు తీసుకోవాలని ముదిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Allso read:- మునుగోడు కు సీఎం కేసీఆర్… ఎప్పుడంటే..?

 

★★ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తున్న వీడియో దిగువున