Telugu News

దండెంపై బట్టలారేయపోయి విద్యాఘాతంతో మహిళ మృతి

విషాదంలో ముత్యాలగూడెం

0

దండెంపై బట్టలారేయపోయి విద్యాఘాతంతో మహిళ మృతి

== విషాదంలో ముత్యాలగూడెం

కూసుమంచి, అక్టోబర్ 18(విజయంన్యూస్)

దండంపై ఉతికిన బట్టలను అరేసేందుకు వెళ్లిన ఓ మహిళ విద్యాఘాతంతో అక్కడిక్కడే చనిపోయిన సంఘటన మంగళవారం ముత్యాలగూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం కూసుమంచి మండలం ముత్యాల గూడెం గ్రామానికి చెందిన పేరెళ్లి లక్ష్మి (45) ఇంట్లో పనులు చేస్తూ, వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. రోజు లాగే మంగళవారం బట్టలు ఉతికేసిన ఆమె దండంపై బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుధాఘాతంలో చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరుమన్నారు. కూసుమంచి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

allso read- నేలకొండపల్లి మండలంలో మహిళపై బీఆర్ఎస్ నేత దాడి