సాగర్ ఎడమ కాల్వలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం.
(కూసుమంచి-విజయం న్యూస్)
సాగర్ ఎడమ కాల్వలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమైాయ్యాయి. కూసుమంచి మండలం, నాయకన్ గూడెం ఇన్ ఫాల్ రెగ్యులేటర్ వద్ద రెండు గుర్తు తెలియని మృతదేహాలు వచ్చి గేట్ల వద్దఆగిపోయాయి. పొద్దుగల్ల కాలువకు బట్టలతికేందుకు వెళ్ళిన మహిళలు డెడ్ బాడీలను చూసి స్థానికులకు తెలియజేయగా, వారు కూసుమంచి పోలీసులకు తెలిపారు. వెంటనే స్పందించిన కూసుమంచి పోలీసులు డెడ్ బాడీలను గజ ఈతగాళ్ల సహాయంతో వెలికి తీయించారు. కూసుమంచి పోలీసులు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.