Telugu News

ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15లక్షలు టోకరా

సీపీ కి ఫిర్యాదు.. కలెక్టరేట్ ఎదుట ప్లెక్సితో ధర్నా

0

ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15లక్షలు టోకరా

== రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూళ్లు చేసిన ఓ కానిస్టెబుల్

== ఏళ్లు గడుస్తున్న ఉద్యోగం లేదు.. డబ్బులు లేవు

== మోసపోయామని తెలుసుకుని బోరుమన్నా కూసుమంచి గ్రామానికి చెందిన దంపతులు

== సీపీ కి ఫిర్యాదు.. కలెక్టరేట్ ఎదుట ప్లెక్సితో ధర్నా

== న్యాయం చేయాలంటున్న బాధిత దంపతులు

కూసుమంచి, సెప్టెంబర్ 22(విజయంన్యూస్)

ఆయనోక గౌరవ ప్రథమైన ఉద్యోగం చేస్తున్నాడు.. ప్రజలకు ఎవరైతే రక్షణ అనుకుంటున్నారో అలాంటి ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు పదుల సంఖ్యలో బాధితులున్నట్లు తెలుస్తోంది.. తీగలాగితే డొంక కదిలే అవకాశం ఉంది… అయితే అందులో ఒక్క బాధిత కుటుంబం మాత్రం రోడ్డెక్కంది.. రైల్వేలో ఓ ఉద్యోగం ఇప్పిస్తామని ఆ కానిస్టెబుల్ సుమారు 15లక్షల డబ్బులు వసూళ్లు చేసినట్లు బాధితులు చెబుతున్నారు..

ALLSO READ- రఘునాథపాలెం పీఎస్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం

 

నెలలు గడుస్తున్నప్పటికి ఉద్యోగం రాకపోవడం, మాటలు దాటవేసే విధంగా ఉండటంతో అనుమానించిన ఆ దంపతులు డబ్బులివ్వాలని పట్టుబట్టడంతో బెదిరింపులకు దిగే పరిస్థితి వచ్చింది.. దీంతో మోసపోయామని తెలుసుకున్న ఆ నిరుపేద దంపతులు ఖమ్మంపోలీస్ కమీషనర్ కు వినతి చేశారు. గురువారం కలెక్టరేట్ వద్ద ప్లెక్సితో ధర్నా చేశారు. అసలేం జరిగింది.. ఎందుకు డబ్బులు అంత భారీగా ఇచ్చారో బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామానికి చెందిన చెన్నూ యాదగిరి, ఆయన భార్య మౌనిక వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఓ మిత్రుడి  ద్వారా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి  కానిస్టెబుల్ తో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రస్తుతం వైరా పోలీస్ స్టేషన్ లో కానిస్టెబుల్ గా పనిచేస్తున్నాడని తెలిపారు. ఆయన చెన్నూ యాదగిరి, మౌనికలకు రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రూ.15లక్షలను వసూళ్లు చేశాడు. జనవరి 5, 2019న మొదటి విడతగా రూ.7లక్షలు, ఆ తరువాత రూ.3లక్షలు ఇవ్వడం జరిగింది. మీకు ఉద్యోగం కన్ఫామ్ అయ్యింది. పెద్ద సార్ కు రూ.5లక్షలు ఇస్తే మీకు అపాయిట్ మెంట్ లెటర్ వస్తుందని చెప్పడంతో ఆయనకు రూ.5లక్షలను ఇవ్వడం జరిగింది. మొత్తం రూ.15లక్షలు ఇచ్చిన తరువాత కానిస్టెబుల్ రామారావు పోన్ ఎత్తకపోవడం, రిసీవ్ చేసిన మాటలు దాట వేయడం, బిజీగా ఉన్నా అని చెప్పడం  తదితర వక్రమాటలతో కాలం వెళ్లదిసే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో అనుమానించిన ఆ దంపతులు రామరావు పనిచేస్తున్న వైరాకు వెళ్లి నిలదిశారు. దీంతో డబ్బులు ఇస్తానని స్టాంఫ్ పేపర్ పై రాసి ఇచ్చాడు.

ALLSO READ- సూదిగాళ్లు ‘ఆ నలుగురే’ : ఏసీపీ

ఆ తరువాత సమయం దాటిపోవడం డబ్బులు అడిగితే నేను కానిస్టెబుళ్ ను నన్నేమి చేయలేరు. మీపై దొంగ కేసు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడేవాడని తెలిపారు. దీంతో మోసపోయామని తెల్చిపోయిందని, కుటుంబ సభ్యులందరు బోరుమని విలపించామని అన్నారు. చెమటోడ్చి సంపాధించిన డబ్బులు, అప్పులు తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులు ఏవి కూడా ఇవ్వకపోవడంతో కుటుంబంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మా డబ్బులు మాకు ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. దీంతో మూడు నెలల క్రితం ఖమ్మం పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్ కు వినతి పత్రాన్ని ఇచ్చామని, విచారణ చేస్తామని సీపీ చెప్పడం జరిగిందన్నారు. అయితే మూడు నెలలు గడుస్తున్నప్పటికి ఇప్పటి వరకు అతనిపై చర్య తీసుకోలేదన్నారు. అందుకే జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని, ఆయన చాలా బీజీగా ఉండటం వల్ల మేము సార్ ను కలిసే అవకాశం రావడం లేదన్నారు. అందుకే ప్లెక్సితో ధర్నా చేసి మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని అనుకుంటన్నామని అన్నారు. మాపై దయఉంచి కలెక్టర్, సీపీ లు స్పందించి కానిస్టెబుల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం చేయకపోతే అమరణ నిరాహర దీక్షకు కుర్చునేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. అప్పులు ఎక్కువై ఇంటివద్ద ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నామని, మాపై కరుణ చూపించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోని మాకు న్యాయం చేయాలని కోరారు.

ALLSO READ- నేలకొండపల్లి ఎస్ఐ కు కుల అహంకారం ఉంది: మంద కృష్ణ మాదిగ