Telugu News

==కూసుమంచి పీఎస్ ఎదుట మహిళ ఆందోళన

= సర్థిచెప్పిన పోలీస్ సిబ్బంది..

0

==కూసుమంచి పీఎస్ ఎదుట మహిళ ఆందోళన
== నన్ను అవమానించారంటూ నడిరోడ్డుపై బేటాయించిన మహిళ
== సర్థిచెప్పిన పోలీస్ సిబ్బంది..
==(కూసుమంచి-విజయంన్యూస్);-
కూసుమంచి ఏఎస్ఐ తనపై ఇష్టానుసారంగా మాట్లాడారని, తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని మనస్తాపానికి గురైన ఓ మహిళ కూసుమంచి పోలీస్ పోలీస్ స్టేషన్ ఎదుట ఖమ్మం –హైదరాబాద్ ప్రధాన రహదారిపై బెటాయించింది. తన ఫిర్యాదు తీసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అనంతరం పోలీసులు సర్థి చెప్పి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసిన సంఘటన ఆదివారం కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామానికి చెందిన ఉడుగు బిక్ష్మం, అంజమ్మ దంపతులు కిరాణ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.

also read:-**విజయవంతంగా ముగిసిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

అయితే ఆదివారం అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి షాపు వద్దకు రాగా చిన్నపాటి వాగ్వాదం, ఘర్షణ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆమె జరిగిన సంఘటన కుటుంబ సభ్యులకు చెప్పడంతో కుటుంబ సభ్యులందరు కలిసి దుకాణం వద్దకు వెళ్లి గొడవపడ్డారు. పరస్పర వ్వాగదం కాస్త ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరువురు కూసుమంచి పోలీస్ స్టేషన్ కు చేరుకోగా ఒక వైపు ఫిర్యాదు చేయగా, మరో వైపు పిర్యాదు చేసేందుకు వెళ్లిన ఉడుగు అంజమ్మ పట్ల కూసుమంచి ఏఎస్ఐ దురుసగా ప్రవర్తించినట్లు బాధితురాలు తెలిపింది. దీంతో మనస్తాపానికి గురైన అంజమ్మ కూసుమంచి పోలీస్ స్టేషన్ ఎదుట నడిరోడ్డుపై బేటాయించి ఆందోళన చేసింది. దీంతో కూసుమంచి పోలీస్ సిబ్బంది ఆమెకు నచ్చజెప్పి కచ్చితంగా న్యాయం చేస్తామని హామినిచ్చారు. దీంతో ఆమె ఆందోళన విరమించింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగ స్పందించిన కూసుమంచి సీఐ సతీష్, ఎస్ఐ నందీఫ్ బాధితురాలతో మాట్లాడారు. సంఘటన స్థలం వద్దకు వెళ్లి విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.