ఆర్టీఐ అంటూ సురేష్ సర్పంచులకు బెదరింపులు
== డబ్బుల కోసం పోన్లు చేస్తూ ఇబ్బందిపెడుతున్నాడు
== గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు
== విలేకర్ల సమావేశంలో కూసుమంచి మండల అధికార పార్టీ సర్పంచులు
కూసుమంచి, ఆగస్టు 14(విజయంన్యూస్)
ముదిగొండ మండలం యడవల్లి కి చెందిన దున్నపోతుల సురేష్ కూసుమంచి మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో ఆర్టీఐ పిటిషన్లు వేస్తున్నాడని, తద్వారా సర్పంచులను, అధికారులను బెదిరింపులకు దిగుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని కూసుమంచి మండల అధికార పార్టీకి చెందిన పలువురు సర్పంచులు తెలిపారు. గత రెండు రోజులుగా కూసుమంచి మండలం జీళ్ళచెరువు పంచాయతీ విషయంలో ఆర్టీఐ వేసిన దున్నపోతుల సురేష్ ను అధికార పార్టీకి చెందిన డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ మధ్య జరిగిన బూతు పురాణం సంభాషణ పట్ల టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు సర్పంచులు స్పందించారు.
allso read- పాలేరు ఎమ్మెల్యే అనుచరుడి బూత్ పురాణం
ఈ మేరకు శనివారం పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి క్యాంఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. సురేష్ అనే వ్యక్తి కూసుమంచి మండలంలోని చాలా పంచాయతీల్లో ఆర్టీఐ వేస్తూ సర్పంచులకు పోన్లు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించారు. ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వకపోతే ఫై అధికారులకు అఫిల్ చేస్తామని బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. చీటికిమాటికి ఆర్టీఐలు వేస్తూ తమను పని చేసుకోనివ్వకుండా ఫోన్ లు చేస్తున్న సురేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీఐ పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, ఇవ్వకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. ఒక వైపు గ్రామాల అభివృద్ధికి సర్పంచ్ లు కృషి చేస్తుంటే, మరో వైపు సురేష్ ఆర్టీఐ అంటూ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. సురేష్ లాంటి వారిపై చర్యలు తీసుకుని అతని వేధింపుల నుంచి తమను కాపాడాలని సర్పంచులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కాసాని సైదులు, చెన్నా మోహన్ రావు, బానోతు నాగేశ్వరరావు, వాశంశెట్టి వెంకటేశ్వర్లు, బానోతు కిషన్ నాయక్, రాయబారపు స్వాతి, జర్పుల పింప్లీ, కొండా సత్యం, ఎంపీటీసీ జర్పుల బాలాజీ నాయక్ తదితరులు హాజరైయ్యారు.
allso read-బూతు పురాణంపై స్పందించిన ఇంటూరి శేఖర్